చంద్రబాబు అరెస్ట్ బీజేపీ కుట్రే.. వైఎస్ ఆత్మ సంచలన వ్యాఖ్యలు!

Publish Date:Oct 31, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ప్మెంట్ స్కాం పేరుతో అక్రమంగా అరెస్టు చేసి 52 రోజుల పాటు నిర్బంధించారు.  ఎట్టకేలకు మంగళవారం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్, క్యాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఇక స్కిల్ కేసు విషయానికి వస్తే.. తొలి నుండి ఇది అక్రమ కేసేనని రిటైర్డ్ న్యాయమూర్తుల నుండి మాజీ ఐపీఎస్ ల వరకూ అందరూ చెప్తూనే వచ్చారు. అక్రమ అరెస్టు, అక్రమ కేసులే అయినా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అత్యధిక కాలం ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం.. ఒక ప్రభుత్వం ఇంత యథేచ్ఛగా ఇష్టారీతిగా, విలువలు, నిబంధనలను పట్టించుకోకుండా ఎలా ప్రవర్తించగలుగుతోందన్న అనుమానాలు మొదటి నుంచీ వెలువడుతూనే ఉన్నాయి.   సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మద్దతూ లేకుండా ఇంతటి సాహసానికి దిగారంటే తొలి నుండి  కూడా ఎవరూ నమ్మడం లేదు.  ఏపీలో చీమ కుట్టాలన్నా కేంద్రం అనుమతి కావాల్సిందేనన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక చంద్రబాబు అరెస్టు అంశంలో కూడా బీజేపీ పెద్దల హస్తం తప్పకుండా ఉండి ఉంటుందనే అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. 

ఇప్పటికే పలువురు  తెలుగుదేశం నేతలు ఇవే అనుమానాలను  బాహాటంగానే వెల్లడించారు.   ఇతర పార్టీలలో నేతలు, పలువురు అధికారులు కూడా ఈ అక్రమ అరెస్ట్ వెనక బీజేపీ అగ్రనాయకత్వం ఉందన్నదే తన అభిప్రాయమని చెప్పారు.  తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టుతో తమకు సంబంధం లేదని చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతలు సానుభూతి ప్రకటించినా.. ఈ అరెస్టులో కేంద్రం హస్తం, బీజేపీ అగ్రనేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయమే బలంగా వ్యక్తం అయ్యింది.  ఈ క్రమంలోనే ఇప్పుడు మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితుడిగా.. వైఎస్ ఆత్మగా పేరున్న రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు వెనక కేంద్రం హస్తం ఉందన్న కేవీపీ.. జగన్ ని అడ్డం పెట్టుకొని కేంద్రం నాటకం ఆడుతుందని విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. లోకేష్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని కేవీపీ ఘాటుగా విమర్శించారు.

విజ‌య‌వాడ‌లో ఏపీ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ తొలి సమావేశాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం కేవీపీ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు అరెస్టు వెనుక పెద్ద క‌థే న‌డిచింద‌న్నారు.  చంద్రబాబు అరెస్టు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆడుతున్న నాట‌కంగా ఆయ‌న అభివర్ణించారు. సీఎం జ‌గ‌న్‌ను అడ్డుపెట్టి కేంద్రం ఆడిన నాట‌కంలో చంద్ర‌బాబు పావుగా మారారని కేవీపీ అన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కేంద్రంలోని పెద్ద‌ల వ్యూహం ఉంద‌ని, కానీ, దీనిపై మాట్లాడేందుకు కొంద‌రికి ధైర్యం స‌రిపోవ‌డం లేద‌ని కేవీపీ తీవ్ర  వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ కార్యవర్గ కార్యదర్శి నారా లోకేష్ కు అనేక రోజుల నిరీక్షణ తరవాత హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని.. ఈ అరెస్ట్ వెనక బీజేపీ నేతలు ఉన్నారనే దానికి అదే నిదర్శనమని కేవీపీ పేర్కొన్నారు.

గత ఏడాది కాలంగా బీజేపీ పెద్దలు తెలుగుదేశం మీద ఫోకస్ పెంచారు. దేశవ్యాప్తంగా మిత్రులు అందరినీ దూరం చేసుకున్న బీజేపీ మళ్ళీ వారిని దగ్గర చేసుకొనే ప్రయత్నం చేసింది. కానీ  ఎవరూ నమ్మి ఎన్డీఏలో చేరడం లేదు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని బీజేపీకి అనుకూల జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. అది కూడా ఏకంగా చంద్రబాబు బీజేపీకి 40 సీట్లు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇది ఒకరకంగా బీజేపీ పాలిటికల్ గేమ్ ప్లాన్. అయితే  బీజేపీ ప్రచారానికి చంద్రబాబు నుండి స్పందన రాకపోవడంతో జగన్ ను అడ్డం పెట్టుకొని ఇలా తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలను బలపరిచే విధంగా  సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేవీపీ లాంటి వాళ్ళు ఈ అరెస్టు బీజేపీ కుట్రేనని వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. 

By
en-us Political News

  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.