జగన్ తో రణమా.. శరణమా.. బీజేపీ హైకమాండ్ కు రాష్ట్ర నేతల అల్టిమేటమ్!?

Publish Date:Oct 9, 2023

Advertisement

తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోయింది. సైద్ధాంతిక నిబద్ధత, క్రమశిక్షణ అంటూ గొప్పగొప్ప కబుర్లు చెప్పే కమలనాథులు.. ఎన్నికల సమయానికి వాటన్నిటినీ గాలికొదిలేసి.. నాలుగు ఓట్లు సంపాదించిపెట్టగలిగే నాయకుడు ఉంటే చాలు లాగేయండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 

నిన్న మొన్నటి దాకా తెలంగాణలో అధికారం మాదే.. అంటూ ఘనంగా చాటుకున్న నేతలు ఇప్పుడు పరోక్షంగానైనా.. హార్స్ ట్రేడింగ్ లో మేం దిట్టలం.. హంగ్ వచ్చినా అధికారం మాదే అనే స్థయికి దిగజారిపోయారు. నిన్న మొన్నటి దాకా తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే.. అవినీతి కేసీఆర్ పార్టీని ఓడించి అధికారంలోకి వస్తామని ఢిల్లీ నుంచి గల్లీ నేతల దాకా ఒకే పాట పాడేవారు. ఇప్పుడు గల్లీ నేతలు అసలు మాట్లాడటమే మానేశారు. ఢిల్లీ నేతలు మాత్రం వరుసకట్టి తెలంగాణలో పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో అధికారం మాదేనని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోడీ సైతం.. కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానంటూ కాళ్లావేళ్లా పడినా తాను పట్టించుకోలేదంటూ తెలంగాణ గడ్డపై ప్రకటించి చులకన అయ్యారు. నాలుగేళ్ల కిందట ఎప్పుడో కేసీఆర్ ఎన్డీయేలో చేరుతానని అన్నారనీ, తాను పట్టించుకోలేదనీ ఆయన ఇప్పుడు చెప్పడంపై బీజేపీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని ఆ నాడే వెళ్లడించి ఉంటే.. అప్పుడే బీఆర్ఎస్ గాలి పోయేదికదా.. అంటూ వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర నేతల నుంచే వినవస్తున్నాయి.

ఇంత కాలం బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు చేస్తున్న విమర్శలకు మోడీ వ్యాఖ్యలు మరింత దోహదం చేసి.. తెలంగాణలో పార్టీ పరువును మంటగలిపాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే మొత్తం మీద మోడీ తరువాత రాష్ట్రంలో పర్యటించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్ నిష్టూరమే అయినా నిఖార్సైన నిజాన్ని బయటపెట్టేశారు. మోడీ, షా, నడ్డా ఇలా అగ్రనేతల మాటలను పూర్వ పక్షం చేసే విధంగా తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే బలం లేదని కుండబద్దలు కొట్టేశారు. అయినా రాష్ట్రంలో పార్టీ ఉనికి బలంగానే ఉందనీ, తిమ్మిని బమ్మిని చేసైనా అధికారాన్ని దక్కించుకుంటామని పార్టీ నేతలకు, శ్రేణులకూ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకీ మెజారిటీ రాదనీ, రాబోయేది హంగ్ అసెంబ్లీయేననీ చెప్పి.. హంగ్ పరిస్థితి బీజేపీకే అనుకూలమనీ, అధికారం మనదేననీ చెప్పారు. అంటే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాకుండా హార్స్ ట్రేడింగ్ కు తెరలేపేశారు.   ఇటీవల కొన్ని సర్వేలు పేర్కొన్నట్లు రాష్ట్రంలో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమౌతుందని బీఎల్ సంతోష్ కూడా అంగీకరించేసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. సరే తెలంగాణ సంగతి పక్కన పెడితే..

ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు అధిష్ఠానం తీరుతో విసిగిపోయారు. ఒక వైపు జనసేనతో మైత్రి, మరో వైపు అధికార వైసీపీతో రహస్య బంధం.. మూడో వైపు.. తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అన్న చందంగా   వ్యవహరిస్తోంది. వాస్తవానికి బీజేపీకి ఏపీలో ఏ మాత్రం స్టేక్ లేదు. ఎన్నిక ఏదైనా, ఎప్పుడైనా  ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం ఒకటి  కంటే తక్కువే. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ఒకే ఒక్క ధీమాతో ఎక్కడైనా చక్రం తిప్పేస్తామంటూ బీజేపీ  నేతలు ఇంత కాలం ఏపీలో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ  ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఆ పార్టీ పప్పులు ఉడకడం లేదనీ, అసలు ఉడకవనీ తేటతెల్లమైపోయింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలే ఇక ముసుగులో గుద్దులాట వద్దంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత.. అదే స్థాయిలో బీజేపీ మీదా రిఫ్లెక్ట్ అవుతోందని వారు అధిష్ఠానానికి స్పష్టం చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీని తెలుగుదేశం, జనసేన కూటమి కూడా దరి చేర నిచ్చే పరిస్థితి లేదన్న పరిశీలకుల విశ్లేషణలను బీజేపీ రాష్ట్ర నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎటూ రాష్ట్రంలో పార్టీకి ఎన్నికలో వచ్చేదీ, పోయేదీ లేదు.. కనీసం ఉనికి చాటుకోవడానికి పోటీలో దిగినా.. నోటాకు మించిన ఓట్లు వస్తాయన్న నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దోబూచులాటలను స్వస్తి చెప్పి జగన్ పార్టీతో రణమా..ఆ పార్టీకి శరణమా? అన్నది తేల్చేస్తే.. బెటరని పార్టీ రాష్ట్ర నేతలు అంటున్నారు.  ఒక వేళ ఇంత కాలం రాష్ట్రంలోని అధికార పార్టీకి వంత పాడుతూ కొనసాగించిన రహస్య మైత్రి అలాగే కొనసాగుతుందన్న స్పష్టత వస్తే అందుకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామనీ, ఒక వేళ పార్టీ విధానంతో విభేదిస్తే మౌనం వహిస్తామనీ, అంతే కాక.. తమను అధికార పార్టీపై వాడవాడలా చార్జిషీట్లు వేయండి అంటూ అక్కడ హస్తినలో మాత్రం జగన్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆడుతున్న డబుల్ గేమ్ కారణంగా ఇక్కడ రాష్ట్రంలో తాము నవ్వుల పాలౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 జగన్ సర్కారు అప్పులపై తాము యుద్ధం చేస్తుంటే.. అడ్డగోలు అప్పులు, ఆర్థిక అరాచకత్వం అంటూ విమర్శలు గుప్పిస్తుంటే.. కేంద్రం మాత్రం ఆ అడ్డగోలు అప్పులకు అంత కంటే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తూ  రక్షణ కవచంలా నిలబడుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జగన్ సర్కారుపై బీజేపీ అగ్రనేతల వైఖరి ఏమిటి? రాష్ట్రంలో తాము చేయాల్సిన పని ఏమిటి? అన్నది తేల్చుకునేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో ఒక బృందం హస్తిన బయలు దేరేందుకు రెడీ అయ్యిందంటే.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అవగతమౌతుంది. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం వైఖరి ఏమిటన్నది తేల్చక పోతే తమ దారి తాము చూసుకునేందుకు కూడా రాష్ట్ర నాయకులు సిద్ధపడుతున్నారని సమాచారం.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.