రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంటకసత్యనారాయణ.. విధేయత, సీనియారిటీకే పెద్దపీట

Publish Date:Apr 28, 2025

Advertisement

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సీనియర్ నేత పాక వెంకటసత్యనారాయణ ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. బీజేపీతో పాకా సత్యనారాయణకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది.ఆర్ఎ్ఎస్ నేపథ్యం ఉన్న పాక సత్యనారాయణ బీజేపీలో వివిధ స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నేపథ్యం కలిగిన ఆయన, పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిత్వం కోసం పార్టీ సీరియస్ గా పరిశీలనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. 

 పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం చెందిన బిజెపి సీనియర్ నాయకుడైన పాక వెంకటసత్యనారాయణ  ప్రస్తుతం ఆయన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక్ వెంకటసత్యనారాయణ గోదావరి జిల్లాల్లో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ కేంద్ర మంత్రి అరుణా ఇరానీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బీజేపీ సోమవారం అధికారికంగా పాక వెంకటసత్యనారాయణ పేరు ప్రకటించడంతో ఆ వార్తలన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాక వెంకటసత్యనారాయణ బీసీ వర్గానికి చెందిన నాయకుడు. మంచి వక్త. వివాదరహితుడు. పార్టీకి నాలుగు దశాబ్దాలుగా అంకిత భావంతో పని చేస్తున్నారు. వెంకటసత్యనారాయణను  రాజ్యసభ సభ్యత్వం దక్కడం పట్ల బీజేపీ రాష్ట్రనాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

బీజేపీ ఏపీ కోర్ కమిటీ సోమవారం (ఏప్రిల్ 28) సమావేశమై బీజేపీ అభ్యర్థిపై చర్చించింది. పలువురి పేర్లను పరిశీలించిన తరువాత పాక వెంకటసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసి అధిష్ఠానానికి పంపింది.  ఈ కోర్ కమిటీ సమావేశంలో యూరప్ పర్యటనలో ఉన్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ పాక్ వెంకటసత్యనారాయణ పేరును అధిష్ఠానానికి పంపింది. మరో ఆలోచన లేకుండా పార్టీ హైకమాండ్ కూడా ఆ పేరునే ఖరారు చేసి ప్రకటించింది. పాక్ వెంకటసత్యనారాయణ మంగళవారం (ఏప్రిల్ 29)న నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

వాస్తవానికి, ఈ రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి పలువురి పేర్లు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టి, పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న రాష్ట్ర నేతకే అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.

అత్యంత సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేసిన పాకా సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం నిర్ణయం వెలువడిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయను న్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.