తెలుగుదేశం, జనసేనలతో పొత్తు ఏపీకే పరిమితం.. తేల్చేసిన అమిత్ షా

Publish Date:Jun 10, 2026

Advertisement

ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ పొత్తుల వ్యవహారంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ జనసేనకు తెలంగాణలో కమలం అండ ఆశలను ఆవిరి చేసింది. అదే సమయంలో తెలంగాణలో ఒంటరిగా బలోపేతం కావాలని భావిస్తున్న తెలుగుదేశం ఆశలకు ఊపిరి పోసింది. 

మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు.  దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న   తరుణంలో..  కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో   పొత్తుతో  2024 ఎన్నికల్లో లబ్ధిపొందిన బీజేపీ.. ఆ పొత్తు తెలంగాణలో పొసగదని కుండబద్దలు కొట్టేసినట్లైంది.  తెలంగాణలో కమలంతో కలిసి చక్రం తిప్పాలని ఆశిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు బీజేపీ నిర్ణయం ఒకింత నిరాశ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. 

అమిత్ షా చేసిన ఈ తాజా అధికారిక ప్రకటన ప్రకారం, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలతో పాటు, 2028లో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు.  దీంతో తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. బీజేపీ ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం లో హర్షం వ్యక్తం అవుతున్నది. పొత్తులు లేకుండా బలం పుంజుకోవాలని చూస్తున్న ఆ పార్టీకి ఇది స్వాగతించే విషయమే. ఎందుకంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉంది కానీ కార్యకర్తల బలం, బలగం ఇప్పటికీ చెక్కు చెదరలేదనే చెప్పాలి. అందుకే విభజన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ అన్ని పార్టీలూ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం వెంపర్లాడాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో అంటే 2023లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీపడి మరీ తెలుగుదేశం జెండాను భుజాన మోశారు. కాంగ్రెస్ ఎలక్షన్ ర్యాలీలలో అయితే బాహాటంగానే టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. 

దీంతో తెలంగాణలో ఒంటరి పోరే అన్న బీజేపీ నిర్ణయం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం కావడానికి అంది వచ్చిన అవకాశంగా భావిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, బలమైన క్యాడర్, విస్తృతమైన అభిమాన వర్గం ఉంది.  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు,  మెకానిజం చాలా వరకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసి.. కాంగ్రెస్ కు అధికార పీఠం దక్కడంలో కీలక పాత్ర పోషించాయి.  అదే  రాష్ట్రంలో తెలుగుదేశం బరిలో ఉంటే ఆ క్యాడర్, మెకానిజం తెలుగుదేశానికి బలంగా మారతాయి. ఇప్పటి వరకూ  తెలంగాణలో  జనసేన ముద్ర పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు.   తెలంగాణ రాజకీయాల్లో   సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ ఎంతో పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒంటరి పోరు జనసేనకు అంత సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.