ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఢిల్లీలో బీజేపీకి ఈనాడు ఎదురైంది!
Publish Date:Feb 8, 2025
Advertisement
బీజేపీ ఎట్టకేలకు ఢిల్లీలో జెండా ఎగురవేస్తోంది. దాదాపు పాతికేళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న పార్టీ ఎట్టకేలకు 2025 ఎన్నికలలో ఢిల్లీ అసెంబ్లీలో అధికార పార్టీగా అవతరించనున్నది. తాజా సమాచారం మేరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఇప్పటికే మెజారిటీ మార్క్ ను దాటేసి దూసుకు వెడుతోంది. తుది ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకపోయినప్పటికీ ట్రెండ్స్ ఆధారంగా బీజేపీ అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36 ను దాటేసింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం బీజేపీ 44 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. అధికర ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముచ్చటగా మూడో సారి కూడా కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో జీరో ఫిగర్ తో సరిపెట్టుకోవలసిన పరిస్థిని ఎదుర్కొంటున్నది. ఇక ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజవకర్గంలో విజయం ఆయనతో దోబూచులాడుతోంది. తొలి నుంచీ వెనుకబడి ఉన్న కేజ్రీవాల్.. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యత కనబరుస్తున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఆయన విజయం సాధించడం అంత సులువేమీ కాదని అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలుండగా అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36. ఈ సంఖ్యను ఆప్ అధిగమించడం ఖాయమని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-all-set-to-form-government-in-delhi-39-192572.html





