బీజేపీ ఎట్టకేలకు ఢిల్లీలో జెండా ఎగురవేస్తోంది. దాదాపు పాతికేళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న పార్టీ ఎట్టకేలకు 2025 ఎన్నికలలో ఢిల్లీ అసెంబ్లీలో అధికార పార్టీగా అవతరించనున్నది. తాజా సమాచారం మేరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఇప్పటికే మెజారిటీ మార్క్ ను దాటేసి దూసుకు వెడుతోంది.
తుది ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకపోయినప్పటికీ ట్రెండ్స్ ఆధారంగా బీజేపీ అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36 ను దాటేసింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం బీజేపీ 44 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. అధికర ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముచ్చటగా మూడో సారి కూడా కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో జీరో ఫిగర్ తో సరిపెట్టుకోవలసిన పరిస్థిని ఎదుర్కొంటున్నది.
ఇక ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజవకర్గంలో విజయం ఆయనతో దోబూచులాడుతోంది. తొలి నుంచీ వెనుకబడి ఉన్న కేజ్రీవాల్.. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యత కనబరుస్తున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఆయన విజయం సాధించడం అంత సులువేమీ కాదని అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలుండగా అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36. ఈ సంఖ్యను ఆప్ అధిగమించడం ఖాయమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-all-set-to-form-government-in-delhi-39-192572.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.