రచ్చకెక్కిన బిజెపి, జెడి విభేదాలు
Publish Date:Jul 13, 2022
Advertisement
పాట్నాలో అసెంబ్లీ భవనానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటయిన శతాబ్ది స్తూపాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో జనతా దళ్(జెడి) ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. సాధారణంగా ఏ రాష్ట్రానికైనా ప్రధాని వస్తున్నారంటే భారీ ప్రకటనలు పత్రికల్లో బయట హో ర్డింగ్‌ల రూపంలో దర్శనమిస్తాయి. కానీ ఇక్కడ ఎలాంటి ప్రకటనలూ లేకపోవడంతో బీహార్‌లో జనతా దళ్, బిజెపి మధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. ఈ పరిస్థితులు అలాంటి అనుమానాలనే కలిగిస్తున్నాయని జార్ఘండ్‌లోని వార్తాపత్రికల్లో వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో అనేక ఆంక్షలు పెట్టారు. ప్రతీ నిమిషం ఆ మార్గాన్ని పర్యవేక్షిస్తుంటామని జెడియు నేత ఒకరు చెప్పారు. అయితే ఇక్కడి హిందూ జాగరణ్‌మంచ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యాపారవేత్త జీవన్ కుమార్ వార్తా పత్రికల్లో మొదటి పేజీలోనే ప్రధానికి స్వాగతం పలుతుకున్నట్టు ప్రకటన వేశారు. జీవన్ అక్కడ ఇసుక వ్యాపారిగా ప్రసిద్ధుడు. గత ఏడాది నుంచే అధికార కూటమిలోని సీనియర్ నేతలతో నితీష్ కుమార్ విభేదిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ఉదాహరణ ఆయన కుమారుడి పుట్టినరోజుకు వచ్చిన సీనియర్స్ ఎవ్వరితోనూ ఆయన సరిగా మాట్లాడకపోవడమే. వారంతా బిజెపితో సన్నిహితంగా వుండడమే నితీష్ ఆగ్రహానికి కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు కొన్ని నెలలుగా బీహార్‌లో భాగస్వాముల మధ్య విభేదాలున్నాయి. అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ పథకం పై ఇప్పటికే దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతుననాయి. ఈ సమయంలో జెడియు కాంట్రాక్టు ప్రకారం సైనికుల్ని నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మిత్రపక్ష మైన బిజెపి సమర్ధించడం ఈ విభేదాలను మరింత బయటపెట్టిందని విశ్లేషకుల అంచనా. అందుకే జె.డి.యు నుంచి ఎవరు ఎటువంటి స్వాగత ప్రకటనలు ఇచ్చి ఉండక పోవచ్చు అనే వాదన కూడా విని పిస్తోంది. ఇక అసెంబ్లీ ఆవరణలోని స్తూపం విషయానికి వస్తే, ఈ స్తూపం 40 అడుగుల ఎత్తు ఉంటుంది.25 అడు గుల జేసల్మేర్ రాతితో కప్పబడి ఉంటుంది.15 అడుగు ల కాంస్య శిల్పం అగ్ర స్తనం లో ఉంటుందని అధి కారి ఒకరు చెప్పారు. కాంస్య శిల్పం బీహార్ చిహ్నాన్ని వర్ణిస్తుందని, ఒక బోది వృక్షం,కొమ్మల నుంచి వేలా డుతున్న ప్ర్రార్ధనా పూసలు,రెండు స్వస్తిక్ లు చుట్టూ వున్నాయి అని,ఈ చారిత్రాత్మక చిహ్నం బీహార్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం గా ఉపయోగించ పడుతుందని చెప్పారు.అష్టభుజి క్రాస్ తో వున్న స్తంభం ఆకు పచ్చ రంగులో చిహ్నం అన్నివైపుల నుంచి మూడు సమీప మెట్లతో, భారత రాజ్యాంగం లో వివిధ భాగా లని చూపించే విధంగా అనేక దృష్టాంతాలను వర్ణిస్తూ వుంటుంది. స్తంభం చెట్టులోని ఆకులు సంఖ్య శాసనసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండిటి సభ్యుల ఉమ్మడి బలాన్ని సూచిస్తుంది.బీహార్ లో తొమ్మిది పరి పాలనా విభాగాలని వర్ణించే తొమ్మిది శాఖలు వున్నాయని ఆ అధికారి చెప్పారు. అసెంబ్లీ భవనంలోని సెంట్రల్ పోర్టికోకు ఇరువైపులా గోడలపై శుభాకాంక్షల సందేశాలు మరియు ప్రధాని మోదీ చిత్రంతో కూడిన రెండు భారీ పోస్టర్లు అమర్చారు. బీహార్ అసెంబ్లీ ప్రాంగణాన్ని సందర్శించే సమయంలో, ప్రధాని అధికారికంగా ఒక ఉద్యానవనానికి శతాబ్ది స్మృతి ఉద్యాన్ అని నామకరణం చేస్తారు. శతాబ్ది స్థూపానికి సమీపంలో ఉన్న గార్డెన్‌ను హెర్బల్ మొక్క లు నాటినట్టు అధికారులు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ప్రాంగణానికి ప్రదాని రావడం ఇదే మొదటిసారి. అక్కడ మ్యూజియం కి కూడా ప్రదాని శంకుస్తాపన చేయనున్నారు.ప్రదాని బీహార్ అసెంబ్లీ కి రావడం చారిత్రాత్మకమైనది అని, అందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని జె.డి.యు నేత ఒకరు చెప్పారు. బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్, అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తార్ కిషోర్ ప్రసాద్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని వారు తెలిపారు.ఇంతకుముందు ఒక ప్రకటనలో, స్పీకర్ సిన్హా జూలై 12న ప్రధాని షెడ్యూ ల్ చేయనున్న పర్యటన పట్ల సంతోషం వ్యక్తం చేశారు, ఇది బీహార్ అసెంబ్లీని సందర్శించడానికి ఏ ప్రధానికైనా మొదటి సందర్భం అని అన్నారు. స్పీకర్ ఆహ్వానం మేరకే ప్రధాని వస్తున్నారని, అందుకే అసెంబ్లీ,సచివాలయం సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందచేసామని జె.డి.యు నేత ఒకరు చెప్పారు. ప్రదాని వస్తున్న నేపధ్యంలో పాట్నాలో భద్రత కట్టుదిట్టం చేసారు.
http://www.teluguone.com/news/content/bjp-25-139599.html





