కమలంతో కలిసినందుకే మజ్లిస్ దూరమైంది

Publish Date:Jun 5, 2023

Advertisement

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పని తీరు మీద చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిత్ర పక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు ప్రస్తుతం శత్రుపక్షాలుగా మారాయి. 
అసదుద్దీన్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. షాదీ ముబారక్ వంటి స్కీములను పరిచయం చేసిన బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడంపై  లోతుగా అధ్యయనం చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ప్రచార సమయం నుంచి బిజెపి బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు పూర్తిగా సమసిపోవడమే అసద్ కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్  లీకేజి వ్యవహారంలో మంత్రి కెటీఆర్ హస్తముందని బిజెపి ఆరోపించగా పదో తరగతి పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తముందని బిఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. ఇక్కడితో ఆగకుండా బండి సంజయ్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల  కవిత పాత్ర ఉందని సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటులో పేర్కొంది.అప్పట్లో  రేపో, మాపో కవిత అరెస్ట్ అనే ఊహాగానాల  ప్రచారం జరిగింది. . తీరా చూస్తే కవిత కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అరెస్ట్ వార్త అటకెక్కడంతో మజ్లిస్ పార్టీ అదినేత అసద్ కు కీడుశంకించింది. బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి అని ప్రపంచానికి తెలిసిపోయింది. బీఆర్ఎస్ తో ముందుకెళితే దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓటర్లు దూరమవుతారని మజ్లిస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడైంది. దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ గల్లంతవుతుందని మజ్లిస్ ముందే పసిగట్టింది.ఈ కారణంగా మజ్లిస్ బిఆర్ఎస్ ను విమర్శించింది. 

By
en-us Political News

  
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.