వంగవీటి రాధాకు బీజేపీ గాలం?

Publish Date:Aug 29, 2022

Advertisement

ఉత్తరాదిలో ఒక వెలుగు వెలుగుతున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా స్థానం సంపాదించుకోడానికి చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహం లేదు. ఉత్తరాది నేతల చేతుల్లో ఉండే పార్టీగా పేరు పడిన బీజేపీ దక్షిణాదిలో ఒక్క కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణలో పాగా వేసేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు తరచూ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉనికే నామమాత్రం అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా బీజేపీ నేతలు ఏపీని కూడా ఎలాగైనా చిక్కించుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 ఉమ్మడి ఆంధ్రప్రేశ్ ను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని విభజిత ఏపీ ప్రజలు నిట్ట నిలువునా పాతేశారు. అలాగే ఏపీ విభజనకు తోడ్పడి, ఆ తరువాత రాష్ట్రానికి రావలసిన విభజన హామీలకు ఎగనామం పెట్టిన  బీజేపీ అన్నా కూడా ఆంధ్ర ప్రజలలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అందుకే బీజేపీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏపీలో విజయం సాధించిన దాఖలాలు దాదాపు మృగ్యం. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా బీజేపీకి ఏమీ ఒరగలేదు. తర్వాత అదే సామాజికవర్గానికే చెందిన సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించినా బీజేపీ పెద్దల పాచిక పారలేదు. ఎన్ని రకాల పిల్లి మొగ్గలు వేసినా బీజేపీ ఆటలు ఏపీలో అరటిపండు మాదిరిగానే మిగిలిపోయాయి(ఆటలో అరటి పండు).  ఈ నేపథ్యంలోనే బీజేపీ మరో  కొత్త వ్యూహానికి పదును పెట్టినట్లు సమాచారం.  ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలు, తరగతుల్లోని నాయకులకు తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ఏదో ఒక మేరకు ప్రభావితం చేయగల కాపు సామాజికవర్గం ఓట్లను వచ్చే ఎన్నికల నాటికి   అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వివిధ మార్గాల్లో యత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గంలో బలీయమైన మద్దతు ఉన్న వంగవీటి రాధాకు తాము అనుకూలమనే సంకేతాలు బీజేపీ నేతలు పంపుతున్నారు. దివంగత కాపు నేత వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ఆ సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉందనేది నిస్సందేహం. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధా  అంతకు ముందు   కాంగ్రెస్ పార్టీలో,  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో చేరి, అదే పార్టీలో కొనసాగుతున్నారు.

 టీడీపీలో వంగవీటి రాధా ఉన్నప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో అప్పుడప్పుడు వినవస్తుంటాయి. టీడీపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి తనకు ఉన్నట్లు ఏనాడూ రాధా స్వయంగా బయటికి చెప్పలేదు. అయినప్పటికీ వంగవీటి రాధాను తమ వైపు తిప్పుకుని కాపు సామాజికవర్గం ఓట్లను రాబట్టుకోవాలనే యోచనతో బీజేపీ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ రాజకీయ వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

‘వంగవీటి రాధా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టం. టీడీపీలో ఉన్నానని రాధా చెబుతున్నా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ వస్తుందనే గ్యారంటీ లేదు. అందుకే రాధా మా పార్టీలోకి వస్తే.. ఆయన భవిష్యత్తు బాగుంటుంది’ అని విజయవాడలోని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కూడా రాధా ప్రొఫైల్ గురించి వాకబు చేసినట్లు చెబుతున్నారు. రాధాయే గనుక బీజేపీలోకి వస్తే.. ఆయన కోరుకున్న స్థానంలో పార్టీ టిక్కెట్ ఇప్పించే బాధ్యత సోము వీర్రాజు తీసుకున్నారంటున్నారు. ఈ విషయమే రాధాకు ఏదో ఒక విధంగా చేరవేసి, ఆయనను బీజేపీలో చేర్చుకునే యత్నాలు మొదలయ్యాయని సమాచారం. బీజేపీ యత్నాలు సఫలమై, ఆ పార్టీలో రాధా చేరితే.. ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందో చూడాలి మరి.

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.