Publish Date:Apr 23, 2025
బోరుగడ్డ అనిల్ అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు. చర్చి స్థలం విషయంలో అనంతపురం మూడో పట్టణ సీఐను బెదరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను అనంతపురం తీసుకువచ్చారు. ఈ కేసు విచారించిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు సమయం పెద్దగా లేకపోవడంతో ఆయన తిరిగి రాజమహేంద్రవరం తరలించకుండా అనంతపురంలోనే రిటైన్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బూరగడ్డ అనిల్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసినలో రాజమహేందరవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బోరుగడ్డ సీఐని బెదరించిన కేసులో అరెస్టై బెయిలు పొంది విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచీ విచారణకు డుమ్మా కొట్టడంతో అనంతపుం మొబైల్ కోర్టు బోరుగడ్డ అనిల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
దీంతో బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకువచ్చారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా పడటంతో అంతవరకూ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా జైలులో రిటైన్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో బోరుగడ్డ అనిల్ అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ తనను తాను సమర్ధించుకుంటూ తాను బెయిలు కోసం ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు సమర్పించలేదని చెప్పుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/birugadda-anil-in-ananthaapuram-jilla-jain-25-196795.html
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!