పిచికలది, పిట్టలదీ గోల కాదు.. వినండి!
Publish Date:Oct 15, 2022
Advertisement
సంగీతం అందర్నీ ఆకట్టుకునే శక్తి కలిగిన కళ. అందులోనూ గాయకులు మరీ ప్రత్యేకం.ఘంటసాల పాట దూరం నుంచి వినపడగానే క్షణం ఆగి వింటారు ఎవ్వరైనా..వీలయితో ఒకటి రెండు చరణాలు గుర్తుచేసు కుంటూ వెళతారు. లతామంగేష్కర్, బాలు.. ఎవరైనా సరే హిందీ అయినా, తెలుగయినా పాట పాటే, గాయ కుడు గాయకుడే ఎవరైనా అంతే గొప్ప ప్రభావం చూపుతారు. మనిషి మనసు బాగోలేనపుడు, ఒంటరిగా ఉన్నపుడో ఒక్క పాట మనసును తేలికపరుస్తుంది. ఇపుడు తాజాగా విదేశీ శాస్త్రవేత్తలు కొత్త సంగతి చెబు తున్నారు..కోయిలనే వినడం కష్టమే.. పక్షుల కిలకిలారావాలు వింటే మనసు ప్రశాంతత పొందుతుందని. వాస్తవానికి ఇది మన పూర్వీకుల మాటే. ప్రకృతి వైద్యశాలల్లో సగం మానిసిక వైద్యం ఇలానే జరిగిపోతుంటుందని అంటూం టారు. అందుకే చెట్లను జీవులను ఎంతో ప్రత్యేకంగా చూడాలం టారు. ఎప్పుడయినా మీ యింటి పరిసరాల్లో చిలకలో, పిచికలో కిలకిలారావం చేయడం చెవొగ్గి విన్నారా? ఒక్క క్షణం.. అదీ మీ ఇంటి ఆవరణలో, అపార్ట్‌మెంట్ ఆవరణలో చెట్లు ఉంటే, మీ కాలనీలో చెట్లు బాగా ఉంటే పొద్దుటే, మద్యాన్నమో పిచికల గోల క్షణం వినండి. చాలా బావుంటుంది. వాటి మధ్య సమాచార ప్రవాహం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. వినేకొద్దీ వినాలనిపిస్తుంది..అంటున్నారు జీవశాస్త్ర వేత్తలు, పర్యావరణ వేత్తలు. ఇంటికోసం చెట్టు కొట్టేసేటపుడు అదే ఆధానంగా ఉన్న పిట్టలు ఏమయి పోతాయ న్నది ఆలోచించాలి. ఎందుకంటే అవి మీకు ఎంతో మానసిక ప్రశాంతతనిచ్చే శక్తి కలిగినవి. అయితే పల్లెలు క్రమేపీ అంతరించిపోతున్నాయి.. అంతా పట్ఠణ వాతావరణం విస్తరించడంలో చెట్టూ చేమనీ అడ్డుగానే భావిస్తున్నారు ఈ తరం. పిట్టలు గోల చేస్తున్నట్టే ఉంటుంది. కానీ కర్ణకఠోరంగా అయితే ఉండదు. పక్షులు పాటలు పాడవు, వాటిలో అవే మాట్లాడుకుంటూ అప్పుడ పుడు కాస్తంత గొంత సవరిస్తూంటాయి. అదీ ఒక్కటి రెండురకాల పక్షులే. అవి ఎలాగూ అపార్ట్ మెంటు ప్రాంతాల్లో కనిపిం చవు. కనుక నిత్యం కనిపించే పిచికలనే పరిశీలించాలంటున్నారు శాస్త్రవేత్తలు. విదేశాల్లో వీటి గురించిన పరిశోధన జరిగింది. మానసిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్నవారిలో చాలా మంది సర్వసాధారణ వాతావరణంలో పిట్టలు, పక్షులు వీలయినంతగా ఉండే తోటల్లో, చెట్లు బాగా ఉన్న ప్రాంతాల్లో వాటిని వింటూ క్రమేపీ మానసిక వొత్తిడికి దూరమవుతున్నారన్నది రుజువయిందట. ఇది చిత్రమేమీ కాదు. మనమే మనచుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను పట్టించుకోమంతే. విదేశాల్లో దీన్ని గురించి ప్రత్యేక పరిశోధనే చేశారు. దీన్నే సహజసిద్ధ చికిత్సగానూ పేర్కొంటున్నారు. ఒకవేళ అలాంటి వాతావరణం లేకున్నా రికార్డు చేసిన పక్షుల మాటల్ని కిలకిలలను వినిపిస్తున్నారట. అది ఎంతో గొప్ప అనుకూల ప్రభావంచూపుతోందిట. ఈసారి సమయం చూసుకుని మీరు ఓ క్షణం వినండి.. అదో అద్భుతం!
http://www.teluguone.com/news/content/birds-chirping-helps-mental-health-39-145492.html





