తెలంగాణ యాసను అక్షరాల్లో పొదిగి.. తెలుగు పాఠకుల మనసులో ఒదిగి

Publish Date:Aug 8, 2020

Advertisement

పాకాల యశోద రెడ్డి
(8ఆగస్టు 1929 - 7 అక్టోబర్ 2007)

సాహిత్యంలోని అనేక ప్రక్రియలను తన కలం ద్వారా సృజించినప్పటికీ పల్లె తెలంగాణను అక్షరాల ఆవిష్కరించిన ఎచ్చమ్మ కథలు ఆమెకు గుర్తింపు నిచ్చాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం తెలంగాణ రచయిత్రిగా చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమే ప్రముఖ రచయిత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు డాక్టర్  పాకాల యశోదారెడ్డి.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అచ్చమైన యాస వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన తెలంగాణ యానను తన కథల ద్వారా బతికించారు యశోదరెడ్డి. ప్రతి కథలోనూ తెలంగాణ గ్రామీణ ప్రాంత ఆత్మ అక్షరాల్లో పొదిగి ఉంటుంది. చదివిన తర్వాత పాఠకుల మనసులో ఒదిగిపోతుంది. దక్కన్ రేడియోలో తెలంగాణ మాండలికంలో ప్రసంగాలు చేసిన తొలి రచయిత ఆమె. యశోద రెడ్డి రచనలు భాషాభిమానులకు నిధులు. వెతుక్కుంటే అందులో ఎన్నో సామెతలు, ఉపమానాలు, చమత్కారాలు అంతర్లీనమై పాఠకులను అలరిస్తాయి. ఆమె ప్రసంగాలు విని తెలంగాణ భాష ఇంత అందమైన యాస అని చాలా మంది అబ్బుర పడేవారట.

 

మహబూబానగర్ జిల్లా బిజినేపల్లిలో యశోద జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సరస్వతమ్మ, కాశిరెడ్డి. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఆమె బంధువుల వద్ద పెరిగారు. చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆమెను హైదరాబాద్ నారాయణగూడలోని మాడపాటి బాలికల పాఠశాలలో చేర్చారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసే ఆయన చదువుపై ఆసక్తి ఉన్న ఆడపిల్లలు పట్టణంలో చదువుకునేందుకు వీలుగా వసతిఏర్పాటు కూడా చేసేవారట. అలా హైదరాబాద్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన యశోద  విజయవాడలో ఆంధ్ర మెట్రిక్ పరీక్షను ప్రత్యేక అనుమతితో రాశారు. ఆమెతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ పరీక్ష రాశారు. గుంటూరు ఎసి కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ పూర్తి చేశారు. 

 

కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలోని అన్నారం గ్రామవాసి ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డితో పెళ్లి జరిగింది. రాతకు గీత తోడైంది. భర్త ప్రోత్సాహంతో ఆమె ఉన్నత విద్య పూర్తి చేశారు. ప్రైవేట్ గా డిగ్రీ చదివి ఉస్మానియా యూనివర్సిటీ నించి ఎం.ఎ (తెలుగు), ఎం.ఎ (సంస్క-తం) పూర్తిశారు. తెలుగు సాహిత్యంలో పి హెచ్ డీ తో పాటు ఆలీగర్ యూనివర్సిటీ నించి డి.లిట్ కూడా అందుకున్నారు.  హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు జర్మన్ భాషలో డిప్లొమా కూడా చేశారు. 

 

కోఠీ విమెన్స్ కాలెజిలో తెలుగు అధ్యాపకురాలిగా తన ప్రస్థానం ప్రారంభించి  ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోఫెసర్ పదవీవిరమణ చేశారు. యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్ గా, అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా అనేక స్థాయిలో పనిచేశారు.

 

కథ, కవిత, వ్యాస ప్రక్రియల్లో ఆమె ఎన్నో రచనలు చేశారు. వందకు పైగా కథలు రాసినా అందులో కొన్ని కథలు మాత్రమే మూడు కథా సంపుటాలుగా వచ్చాయి. ఎచ్చమ్మ కతలు బాగా ప్రాచుర్యం పొందిన కథా సంపుటి. ఉగాదికి ఉయ్యాల, భావిక కవితా సంపుటాలు, కథలూ నవలలూ-ఒక పరిశీలన, కథా చరిత్ర, భారతంలో స్త్రీ, ఆంధ్ర సాహిత్య వికాసం, హరివంశము ఉత్తర భాగము, పారిజాతాపహరణం, తెలుగులో హరివంశములు వ్యాస సంపుటాలుగా వచ్చాయి.

 

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు, సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, నాళం కృష్ణారావు అవార్డు, సురవరం ప్రతాపరెడ్డి అవార్డులూ అందుకున్న ఆమె ఎచ్చమ్మ కతల యశోదగా పాఠకుల మనసులో నిలిచిపోయారు. తెలంగాణ యాసలో సాగే ఆమె రచనలపై చాలామంది పరిశోధనలు చేసి డాక్టరేట్ లు అందుకున్నారు.

By
en-us Political News

  
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.