శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!

Publish Date:Feb 22, 2025

Advertisement

 

పరమేశ్వరుడిని లయకారుడు అంటారు.  శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు.  శివారాధనకు సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఇక ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి రోజు శివుడిని ఎంతో గొప్పగా ఆరాధిస్తారు.  ఇది మాత్రమే కాకుండా ఏడాదికి ఒకసారి వచ్చే మహా శివరాత్రిని మరింత వేభోగంగా జరుపుకుంటారు.  శివపూజలు, శివాభిషేకాలలో ఖచ్చితంగా బిల్వ పత్రి ఉంటుంది.  బిల్వపత్రి అనేది మారేడు ఆకులు.  మారేడు దళాలు అని కూడా అంటారు.  వీటితో పూజ చేస్తే శివుడు చాలా ప్రసన్నం అవుతాడు. శివపూజను సంపూర్ణం చేసే మారేడు దళాలు కేవలం పూజకే కాక.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ మారేడు దళాల వల్ల,  మారేడు ఫలాల వల్ల  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.

మారేడు దళమే కాదు.. మారేడు చెట్టుకు కాయలు కూడా కాస్తాయి. ఈ కాయలను చాలా మంది పట్టించుకోరు. కానీ ఈ కాయలలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

మారేడు కాయలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలగపండును పోలి ఉంటుంది.  వీటి పై భాగం గట్టిగా పెంకులాగా ఉంటుంది.  పండు  లోపల గుజ్జు ఉంటుంది.  ఈ పండులో ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.  ఇవి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతాయి.

మారేడు పండులో యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ వైరల్  గుణాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మారేడు పండును తీసుకుంటే మంచిది.

మారేడు పండు తింటే వేడి నుండి బయటపడవచ్చు.  ముఖ్యంగా వేసవికాలంలో ఎదురయ్యే ఎండ వేడి,  హీట్ స్ట్రోక్ వంటి వాటికి మారేడు పండు చక్కని మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.


                                              *రూపశ్రీ.

గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.