Publish Date:Sep 17, 2020
తరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా ఇంకా వేల కోట్ల సంపాదన కోసం కక్కుర్తి పడే మహానుభావులు ఉన్న ఈ కాలంలో అమెరికా కు చెందిన ఒక పారిశ్రామికవేత్త ఏకంగా తన జీవితకాలం కష్టపడి సంపాదించిన 58 వేల కోట్ల ఆస్తిని గుప్త దానంగా ఇచ్చేసారు. అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, విమానాశ్రయాల్లో ఉండే "డ్యూటీ ఫ్రీ షాపర్స్" సహ వ్యవస్థాపకుడు చార్లెస్ చక్ ఫీనీ తనకున్న యావదాస్తిని గుప్త దానం చేసేశారు. ప్రస్తుతం అయన ఆస్తి మొత్తం విలువ 58 వేల కోట్ల రూపాయలు. 2012లోనే ఈ మొత్తాన్ని ఆయన తన స్వచ్ఛంద సంస్థ "అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్" ద్వారా దానం చేయనున్నట్టు ప్రకటించారు. అయన ఇలా దానంగా ఇచ్చిన దానిలో సగ భాగాన్ని విద్య కోసమే అందించారు. మిగిలిన దానిని మానవ హక్కులు, సామాజిక మార్పులు, ఆరోగ్య సమస్యలు వంటి అంశాల్లో తోడ్పడేందుకు దానంగా ఇచ్చారు. ఈ నెలతో ఆయన దానాలు పూర్తైపోవడంతో.. ఈ నెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం కూడా ముగిసింది. పదవీ విరమణ తర్వాత అయన తన భార్యతో కలిసి జీవించేందుకు కేవలం రూ.14కోట్లనే ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు.
ఈ సందర్భంగా ఫీని మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా నేర్చుకున్నానని, అయితే తాను బతికి ఉండగానే ఈ మంచి కార్యక్రమం పూర్తయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అయన ఫోర్బ్స్ పత్రికతో వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 58వేల కోట్ల ఆస్తిని కలిగిన ఈ అపర కుబేరుడు ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక మామూలు అపార్ట్‌మెంట్ లో తన భార్యతో కలిసి ఓ మధ్యతరగతి వ్యక్తి లాగా విశ్రాంత జీవితాన్ని గడుపుతుండటం మరో విశేషం. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించి అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్న బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఇద్దరూ కూడా తమ దాతృత్వం వెనుక స్ఫూర్తి ఫీనీయే అని చెప్పడం విశేషం. "మేము సంపాదించిన అపార సంపదను దానం చేసేందుకు చక్ మాకు ఓ దారిని ఏర్పరిచాడు. మన ఆస్తిలో సగం కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాడు’’ అని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bill-gates-philanthropy-role-model-has-officially-given-away-all-his-money-25-104141.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.