అశోక్ థామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి.!

Publish Date:Aug 16, 2026

Advertisement

బీహార్ రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లాలోని ప్రసిద్ధఅశోక్ ధామ్ ఆలయం వద్ద సోమవారం (ఆగస్టు 17) తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు దుర్మరణంపాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  శ్రావణ మాసం అందులోనూ  సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అశోక్ థామ్ ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

శ్రావణ  సోమవారం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకాలు జరిపించాలని సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఆశోక్ ధామ్  క్షేత్రానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో మార్మోగింది. రద్దీఅధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది.  ఉదయం ఆరున్న ఆరు   6:45 గంటల మధ్య  సమీప రైల్వే స్టేషన్‌కు ఒకేసారి రెండు రైళ్లు వచ్చాయి. ఆ రైళ్లలో వచ్చిన వేలాది మంది భక్తులు ఒకే సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకోవడంతో ఆలయం వద్ద రద్దీ మరీ ఎక్కువైంది.

అందరూ ఒకే సారి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఆలయ మార్గంలో ఉన్న  బ్యారికేడ్లు   కూలిపోవడంతో ముందు వరుసలో ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. కిందపడిన వారిని వెనుక ఉన్న జనం గమనించకుండా ముందుకు నెట్టుకురావడంతో   తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోగా, పలువురు  తీవ్రంగా గాయపడ్డారు. 

 సమాచారం అందుకున్న   జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. క్షతగాత్రులను  సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.  

Bihar temple stampede, lakhisarai ashok dham,  Shravan Somwar Tragedy, Temple stampede, Ashok dham, TeluguOne

By
en-us Political News

  
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా
జాగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది.
లైంగిక పటుత్వ పరీక్షకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.