అటు బీహార్ ఎన్నికతో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలైంది. నవంబర్ 6, 11వ తేదీల్లో బీహార్ లో రెండు విడతల పోలింగ్ జరగనుండగా.. అదే నెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి. బీహార్ సీట్ల సంఖ్య 243 కాగా, ఓటర్ల సంఖ్య 7. 43 కోట్లుగా ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంగతేంటని చూస్తే.. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లను స్వీకరించనుండగా.. 21 తుదిగడువు. 22వ తేదీ పరిశీలన, 24వ తేదీ ఉపసంహరణ. కాగా నవంబర్ 14న ఈ ఉప ఎన్నిక ఫలితం కూడా తేలనుంది.
ఈ రెండు ఎన్నికలు కాంగ్రెస్ కి ఎంత కీలకమంటే.. ఒక పక్క దేశ వ్యాప్తంగా రాహుల్ ఓట్ల చోరీ ప్రచారం చేయడంతో పాటు బీహార్ లో ప్రత్యేకించి ఆయన యాత్ర నిర్వహించారు. ఎందుకంటే బీహార్ లో సుమారు 45 లక్షల ఓట్లు తొలగించడంతో.. రాహుల్ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ పై ప్రెజంటేషన్లిచ్చి.. ఈసీ ని ఇరుకున పెట్టే యత్నం చేశారు. ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై రియాక్టయిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాలతో సహా కంప్లయింట్ చేయాలని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని వారించారు. తాను ప్రత్యేకించీ ఆధారాలు చూపించనక్కర్లేదనీ.. తన ప్రెజంటేషన్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్.
ఏది ఏమైనా రాహుల్ ఓట్ల చోరీ ప్రచారమంతా కూడా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందే. దానికి తోడు ఆయన ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసిన యాత్ర కూడా ఇదే చెబుతోంది. ఇప్పుడు రాహుల్ ఓట్ చోరీ ప్రచారం జనం నమ్మారా లేదా? అన్నది ఈ ఎన్నికల ఫలితం తేల్చేస్తుందంటున్నారు పరిశీలకులు. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను బటి కాంగ్రెస్ ఎలిగేషన్లు జనం సీరియస్ గా తీస్కుంటున్నారా లేదా? అన్నదానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
ఇక చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇప్పటికే ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ అభ్యర్ధిగా మాగంటి సతీమణి సునీతను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ బై పోల్ కూడా కాంగ్రెస్ కి అగ్ని పరీక్షేనని చెప్పాలి. రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో హైడ్రా ప్రయోగం ద్వారా చేసిన మేలు ఎలాంటిదో చెప్పలేం కానీ.. జనం మాత్రం బ్యాడ్ గా ఫీలవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు హరీష్ రావ్ ఇక్కడ ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్కుని.. ఈ కమ్యూనిటీకి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు.
ఆపై ఇక్కడ అధికంగా ఉండే సినీ జనం, అందునా ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గం. వీటన్నిటినీ కవర్ చేయడానికి మాగంటి సామాజిక వర్గం సరిపోతుందని భావిస్తోంది కారు పార్టీ. దీంతో ఈ గెలుపు తమకు నల్లేరు నడకే అన్న ఊహల్లో ఉంది గులాబీ దండు. అయితే కాంగ్రెస్ మాత్రం ఎట్టకేలకు జూబ్లీహిల్స్ ద్వారా మరో కంటోన్మెంట్ రిజల్ట్ రిపీట్ చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇక ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ అయితే ఈ సీటు ఎలాగైనా సరే కైవసం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా బీహార్ పోల్, జూబ్లీ బై పోల్ కాంగ్రెస్ కి రెఫరండంగా మారనున్నాయనే అంటున్నారంతా. మరి చూడాలి.. ఈ ఫలితాలు కాంగ్రెస్ కి ఎంత అనుకూలంగా వస్తాయో తెలియాలంటే మనం నవంబర్ 14 వరకూ ఎదురు చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bihar-elections-key-for-congress-25-207478.html
Publish Date:Jan 10, 2026
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ యువకుడు రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు కట్టి తన ర్యాలీలో పాల్గొన్నపుడే జగన్ వారించాల్సింది. కానీ అలా చేయలేదు సరికదా? రప్పా రప్పా అంటూ గంగమ్మ జతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతామనడంలో తప్పేంటని మీడియానే ఎదురు ప్రశ్నించారు. దీంతో వైసీపీయులు బరితెగించేశారు. ఆయనకేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బయట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.