జోగి రమేష్ కు ఝలక్.. పెడన జడ్పీటీసీ టీడీపీ కైవసం
Publish Date:Nov 18, 2021
Advertisement
జోగి రమేష్.. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నోరున్న నే. ప్రతి విషయంలోనూ వేలు పెడుతూ తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేస్తుంటాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ పేరు ఎత్తకుండా ఎక్కడా మాట్లాడడు. సీఎం జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికే చంద్రబాబు లక్ష్యంగా జోగి రమేష్ అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తుంటారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. మంత్రి పదవి కోసమే చంద్రబాబును అదేపనిగా జోరి రమేష్ విమర్శిస్తుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. వైసీపీలో తానే తోపు, సీఎం జగన్ కు తానే దగ్గర అని ఫోజులు కొట్టుకునే జోగి రమేష్ కు తాజాగా బిగ్ ఝలక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కి పెడన ప్రజలు షాకిచ్చారు. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్లతో గెలుపొందారు. పెడన జడ్పీటీసీ ఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్నారు జోగి రమేష్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలింగ్ రోజుల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా పెడన జడ్పీటీసీగా టీడీపీ గెలుపోదడంతో జోగి రమేశ్ కు షాక్ తగిలింది. పామిడి మండలం గజరాంపల్లి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి రామలక్ష్మి 202 ఓట్లతో గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో పెడనలో జోగి రమేష్ కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ సాగుతోంది. సర్వశక్తులు ఒడ్డినా జడ్పీటీసీగా గెలవలేకపోవడంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఎమ్మెల్యే రమేష్ కుడా ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. పెడన విజయంతో టీడీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెడన నియోజకవర్గంలో ఇదే ఫలితం పునరావృతం అవుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/big-shock-to-ycp-mla-jogi-ramesh-in-pedana-zptc-election-39-126641.html





