అఖిలమ్మ పంచాయతీ

Publish Date:Aug 2, 2022

Advertisement

ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మళ్లీ వార్తల్లో నిలిచారు. భూమా అఖిల ప్రియ, ఆమె సోదరి భూమా మోనికపై వీరి సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందుకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. గతంలో జిల్లా కోర్టులో తన అక్కలపై వేసిన కేసు నిలబడకపోవడంతో సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవుల్లో సర్వే నెంబర్ 190, 192/ఏ, 192/బీలలో భూమా నాగిరెడ్డి భార్య భూమా శోభానాగిరెడ్డి పేరు మీద వెయ్యి గజాల స్థలం ఉంది.   ఆమె 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆమె భర్త భూమా నాగిరెడ్డి రెండు కోట్ల రూపాయిలకు ఆ స్థలం విక్రయించినట్లు తెలుస్తోంది.   స్థలం విక్రయించే క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమా నాగిరెడ్డి, ఆయన ఇద్దరు కుమార్తెలు అఖిల ప్రియ, మౌనిక సంతకాలు చేయగా, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వేలు ముద్ర వేసినట్లు సమాచారం.  

అయితే   స్థలం విక్రయించిన సమయంలో తన వయస్సు 17 సంవత్సరాలని.. అప్పుడు తాను మైనర్ అని.. ఇది చెల్లదని.. తనకు ఆ స్థలంలో వాటా వస్తుందంటూ జగత్ విఖ్యాత రెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఆ క్రమంలో   స్థలాన్ని కోనుగోలు చేసిన అయిదుగు వ్యక్తులతోపాటు తన ఇద్దరు అక్కలపై  కోర్టులో కేసు వేశాడు. ఆ కోర్టు వీరి వాదనలు విని ఈ కేసును కోట్టేసింది. దీంతో జగన్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.

మరోవైపు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలదీ సుధీర్ఘ రాజకీయం జీవితం.. తల్లి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిల ప్రియ  ఆ తర్వాత ఆళ్లగడ్డ నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తండ్రి నాగిరెడ్డితో కలిసి.. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతలో ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో, అఖిల ప్రియకు చంద్రబాబు కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా చోటు కల్పించారు.

అలా మంత్రి అయిన అఖిల ప్రియ.. ఆ తర్వాత.. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అఖిల ప్రియ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తన తండ్రి నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి సుపారీ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే హైదరాబాద్ నగరంలో ఓ స్థల వివాదంలో సీఎం కేసీఆర్ సమీప బంధువు కిడ్నాప్ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఆమె జైలుకు  వెళ్లి, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆమె తాత ఎస్వీ సుబ్బారెడ్డి, మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి  గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుతం ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంత మంది ఉన్నా.. భూమా అఖిల ప్రియ ఫ్యామిలీలో.. ఇలాంటి వివాదాలు చుట్టుముట్టడం పట్ల భూమా వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు భూమా నాగిరెడ్డి, భూమా శోభ నాగిరెడ్డిల దంపతులు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంది... నేడు ఎలా ఉందని ఓ చర్చ   ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జోరుగా నడుస్తోంది.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.