అంతా భార‌తి మాయ‌!

Publish Date:Jul 21, 2022

Advertisement

అమ్మా..దుర్గా.. అని మ‌న‌సారా స్మ‌రించే స‌రికి శివాజీకి దుర్గా మాత ఖ‌డ్గం ఇచ్చిందంటారు.  రామా న‌ను బ్రోవ‌రా అని త్యాగ‌య్య వేడుకోగానే రాముడు మారువేషంలో వెళ్లి ప‌రిస్థితులు తెలుసుకుని క‌రుణించాడు. ఏదేమైన‌ప్ప‌టికీ, భ‌క్తుల క‌థ‌లు తేల్చిన‌దేమంటే.. అయ్య‌వారికంటే అమ్మ‌వారి ద‌యే బ‌హు దొడ్డ‌ది, జీవితాన్నిస్తుంది, చింత‌ లేకుండా బ‌తికేయ‌మని. ఇలాంటివి ఒట్టి క‌థ‌లే అంటారు నిర‌సించేవారు. కానీ  ఈ రోజు ల్లోనూ అలాంటి అమ్మ‌వారు, అలాంటి సంపూర్ణ భ‌క్తుడూ మ‌న క‌ళ్ల‌ముందే ఉన్నార‌న్న‌ది చాలా ఆలస్యం గా వెలుగు చూసింది. ఆ అమ్మవారు భార‌తీ అమ్మ‌వారు.. ఆ భ‌క్తుడు విజ‌య‌సాయి!  అవును దేవ‌ర వారు ఏమన్నా, అమ్మ‌వారి ప‌లుకులు ఆంగ్లంలో వ‌చ్చినా దాని వల్ల విజ‌య‌సాయిరెడ్డి కి మాత్రమే మేలు జ‌రుగుతోంది.

యావ‌త్‌ భార‌త దేశంలో కాంగ్రెస్ నాయ‌కులు, అభిమాన‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు వారి అధి దేవ‌త సోనియా గాంధీ నే. ఆమె మాటే శాస‌నం, కాదంటే ఇర‌కాట‌మే! ఇపుడు అలాంటి గొప్ప సంప్ర‌దాయం వైసీపీలోనూ ఉంద న్నది కేవ‌లం అనుమానం కాదు వాస్త‌వ‌మేమో అనిపిస్తుంది. కార‌ణం పార్టీ హైక‌మాండ్ లా భార‌తి తెర వెనుక క‌థ న‌డుపుతున్నార‌న్న సంగ‌తి పార్టీ వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది. కాకుంటే, పార్టీ వ‌ర్గాలు గ‌ట్టిగా పైకి చెప్ప లేకపోతున్నాయి. కానీ కీల‌క ఎత్తుగ‌డ‌లు, నిర్ణ‌యాల్లో ఆమె మాట చెల్లుబాట‌వుతోంద‌న్న టాక్ ఉంది.  తాజాగా విజయసాయిరెడ్డి.. పెద్దల సభ రాజ్యసభలో మళ్లీ సభ్యుడిగా ప్రమాణం చేసిన వీడియోతో పాటు వైయస్ జగన్, వైయస్ భారతమ్మకు  తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ అంశం పై  మళ్లీ ఫ్యాన్ నేతల్లో సందేహాలు పెరిగాయి.

ఇటీవల ఉత్తరాంధ్రలో పార్టీ  ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి  తప్పించి.. పార్టీలో సాధారణ  బాధ్యతలను విజయసాయికి అప్పగించింది తాడేపల్లి ప్యాలెస్‌లోని పార్టీ అధిష్టానం. అలా జరిగిన రెండు మూడు రోజు లకే  పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు సైతం విజయసాయిరెడ్డికి దఖలు పడ్డాయి.  ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలకు దఖలు పడిన వాటిని మళ్లీ  విజయసాయిరెడ్డి చేతు ల్లోకి తీసుకు వెళ్లి మరీ పెట్టారు. ఆ క్రమంలోనే మళ్లీ విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు  ఆటోమెటిక్‌గా రెన్యూవల్ జరిగిపోయింది. ఆ వెంటనే విజయసాయిరెడ్డి  మీడియా సాక్షిగా వైయస్ జగన్‌తోపాటు వైయస్ భారతమ్మకు ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో దీనిపై మీడియాలోనే కాదు  సోషల్ మీడియాలో సైతం చర్చ రచ్చ రచ్చగా జరిగింది కూడా.

వాస్త‌వానికి  విజయసాయిరెడ్డిని మళ్లీ రాజ్యసభకు పంపరంటూ తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా    గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఆయ‌న‌కి మళ్లీ పెద్దల సభలో సభ్యుడిగా అవకాశం వ‌చ్చింది. ఇదెలా సాధ్య‌మ‌ని చాలా మంది చాలా ఆలోచించారు.   అసలు మళ్లీ ఆయన ఎలా చాన్స్ కొట్టే శారంటూ ఓ చర్చ  తాడేపల్లి ప్యాలెస్‌లోనే యమ జోరుగా నడిచిందట. మాత ద‌య ఉంటే ఏద‌న్నా, ఎలాగైనా జ‌రిగిపోద్దంతే!

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత  విజయసాయి దాదాపుగా కనుమరుగు అయ్యిపోయారు. అంటే ఉత్త రాంధ్ర భాధ్య‌తలు చేపట్టి.. విశాఖలోనే మకాం పెట్టేరు.  ఆయనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నా రట. ఆ క్రమంలో  సదరు వర్గం  విశాఖలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయిందట. దీంతో  వీరిపై  ఫిర్యాదులు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో  సీఎం  జగన్‌ రంగంలోకి దిగి విజయాసాయిరెడ్డి.. ఉత్తరాంధ్ర బాధ్యతలకు చెక్ పెట్టి.. తాడేపల్లి ప్యాలెస్‌లో  కొలువు చేసుకోవాలంటూ ఆదేశించారట. అలా ఆదేశాలు వెలువడిన రెండు మూడు రోజులకే ప్యాలెస్‌లోని.. పెద్ద అమ్మ గారు తెరపైకి వచ్చి విజయ సాయిరెడ్డికి పూర్వవైభవం కల్పించాలంటూ ఆదేశించారని సమాచారం. అమ్మవారి నుండి.. అదీ సీఎం గారి హోం మినిస్టర్ నుంచి ఆదేశాలు రావడంతో ఇక చేసేది లేక.. అప్పటి కప్పుడు.. యుద్ద ప్రాతిపదికన విజయసాయిరెడ్డివారికి అన్ని కీలక బాధ్యతలు దఖలు పడ్డాయట. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తాడేపల్లి ప్యాలెస్‌లోని వారంతా..  అంతా భారతీ మాయ అంటున్నారట. 

అలాగే మళ్లీ ఎన్నికలు సీజన్ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల్లో అనుకూలురైన వారిని ఎక్కడ ఉంచాలి.. వ్యతిరేకంగా ఉన్న వారికి ఎక్కడ తుంచాలి అనే తరహా మంత్రాంగంలో   అమ్మ గారు  ప్రస్తుతం నిమగ్నమైనట్లు సమాచారం. ఏదీ ఏమైనా.. తమ గోడు.. అయ్యవారికి  చెప్పుకొంటే.. ఆ పని.. కొంతే వరకే జరుగుతోందని.. అదే అమ్మ వారిని  ఫ‌లం పుష్పం తోయంతో పాటు అష్టోత్తర శత సహస్ర నామాలతో జపిస్తే.. ఏమి తెలియని కాళిదాసును అమ్మవారు కరుణించి  మహాకవిని చేసినట్టు  ఈ విజయ సాయిరెడ్డిని మళ్లీ పెద్దల సభకు పంపించారనే ఓ టాక్  అయితే మళ్లీ ఫ్యాన్ పార్టీలో ఫ్యాన్  తిరిగినట్లు గింగరాలు తిరుగుతోందట.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.