భగత్‌సింగ్ ఎవరికంటే తీవ్రవాది సిమ్రన్‌జిత్ జీ!
Publish Date:Jul 17, 2022
Advertisement
దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో భగత్‌సింగ్ అనే కుర్రాడు తన జీవితాన్ని లెక్క చేయకుండా బ్రిటీష్‌వారికి బుద్ధిచెప్పాలని కంకణం కట్టుకున్నాడు. అప్పటి దేశభక్తి అంతటిది. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ యువత దేశాన్ని దాస్య శృంఖ లాల నుంచి విముక్తి చేయడానికి రంగంలోకి ఉరికారు. తమ వంతు కాగలిన కార్యాన్ని సాధించారు. ప్రాణాలు కోల్పోయారు. మరణాన్ని ముద్దాడారు. అలాంటి దేశభక్తుడు, భగత్‌సింగ్ తీవ్రవాదిగా పంజాబ్ ఎంపి సిమ్రన్‌జిత్ సింగ్‌గారికి ఎలా అనిపించాడో మరి. అయినా ఆ కాలం వేరు, ఇప్పటి రాజకీయపరిస్థితులు వేరు. భగత్‌సింగ్ ఒక ఇంగ్లీషు అధికారిని కాల్చి చంపాడని, అసెంబ్లీలో సభ జరుగుతుండగా బాంబులు విసిరాడని సిమ్రాన్ జిత్ ఆరో పణ. కానీ అప్పటి దేశభక్తి ఆవేశం, నరనరాన స్వతంత్ర కాంక్ష వున్నపుడు అప్పటి కుర్రాళ్లు అంతటి ఆవేశాన్ని ప్రదర్శిం చారు. అది తప్పని పరిస్థితి. కానీ ఆయన అలా చేసి వుండకపోవచ్చన్నది మాన్‌సింగ్ గారి అభిప్రాయం. అసలు మాన్‌గారు ఈ విధంగా ఏదో ఒకటి చర్చనీయంశంగా మార్చడం పరిపాటి. గతంలో 2007లో ఈయనే భగత్‌సింగ్‌ను చిన్నపాటి ఉగ్రవాది అన్నారు. అంతటితో ఆగక 2015లో ఛండీగఢ్ విమానా శ్రయానికి భగత్‌సింగ్ పేరు పెట్టడానికి కూడా తిరస్కరించారు. ఎంపీ గారికి కామెంట్లు చేయడం చాలా ఇష్టం. అలా రాజకీయ చర్చల్లో హాట్ హాట్‌గా తన పేరు అందరినోటా వినడమూ ఆయనకు ఇష్టం కావచ్చు. అందుకే చాలా కాలం నుంచి మొన్న ఎంపీ అయ్యేవరకూ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. అయితే పంజాబ్ ప్రజలు ఈ పెద్దాయన మాటలు అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ పంజాబ్ మంత్రి గుర్మీత్‌సింగ్ మీత్ హయర్ మాత్రం మండిపడుతున్నారు. అందుకే పెద్దాయన్ను ప్రజలకు క్షమాపణ చెప్పాలని గుర్మీత్ డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bhagatsingha-terrorist-simranjit-25-139943.html





