Publish Date:Jul 17, 2022
దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో భగత్‌సింగ్ అనే కుర్రాడు తన జీవితాన్ని లెక్క చేయకుండా బ్రిటీష్‌వారికి బుద్ధిచెప్పాలని కంకణం కట్టుకున్నాడు. అప్పటి దేశభక్తి అంతటిది. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ యువత దేశాన్ని దాస్య శృంఖ లాల నుంచి విముక్తి చేయడానికి రంగంలోకి ఉరికారు. తమ వంతు కాగలిన కార్యాన్ని సాధించారు. ప్రాణాలు కోల్పోయారు. మరణాన్ని ముద్దాడారు. అలాంటి దేశభక్తుడు, భగత్‌సింగ్ తీవ్రవాదిగా పంజాబ్ ఎంపి సిమ్రన్‌జిత్ సింగ్‌గారికి ఎలా అనిపించాడో మరి. అయినా ఆ కాలం వేరు, ఇప్పటి రాజకీయపరిస్థితులు వేరు.
భగత్‌సింగ్ ఒక ఇంగ్లీషు అధికారిని కాల్చి చంపాడని, అసెంబ్లీలో సభ జరుగుతుండగా బాంబులు విసిరాడని సిమ్రాన్ జిత్ ఆరో పణ. కానీ అప్పటి దేశభక్తి ఆవేశం, నరనరాన స్వతంత్ర కాంక్ష వున్నపుడు అప్పటి కుర్రాళ్లు అంతటి ఆవేశాన్ని ప్రదర్శిం చారు. అది తప్పని పరిస్థితి. కానీ ఆయన అలా చేసి వుండకపోవచ్చన్నది మాన్‌సింగ్ గారి అభిప్రాయం. అసలు మాన్‌గారు ఈ విధంగా ఏదో ఒకటి చర్చనీయంశంగా మార్చడం పరిపాటి.
గతంలో 2007లో ఈయనే భగత్‌సింగ్‌ను చిన్నపాటి ఉగ్రవాది అన్నారు. అంతటితో ఆగక 2015లో ఛండీగఢ్ విమానా శ్రయానికి భగత్‌సింగ్ పేరు పెట్టడానికి కూడా తిరస్కరించారు. ఎంపీ గారికి కామెంట్లు చేయడం చాలా ఇష్టం. అలా రాజకీయ చర్చల్లో హాట్ హాట్‌గా తన పేరు అందరినోటా వినడమూ ఆయనకు ఇష్టం కావచ్చు. అందుకే చాలా కాలం నుంచి మొన్న ఎంపీ అయ్యేవరకూ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు.
అయితే పంజాబ్ ప్రజలు ఈ పెద్దాయన మాటలు అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ పంజాబ్ మంత్రి గుర్మీత్‌సింగ్ మీత్ హయర్ మాత్రం మండిపడుతున్నారు. అందుకే పెద్దాయన్ను ప్రజలకు క్షమాపణ చెప్పాలని గుర్మీత్ డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhagatsingha-terrorist-simranjit-25-139943.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.