వ‌ద్దు.. ఇక జ‌గ‌న్‌ను వ‌దిలించుకోవ‌డ‌మే మేలు!

Publish Date:Jun 15, 2022

Advertisement

ఫ‌లానా రాజు అద్బుతంగా పాలించేవాడు, ఫ‌లానా మంత్రిగారు బ్ర‌హ్మాండంగా స‌ల‌హాలిచ్చేవారు లాంటివి అనాదిగా వింటూనే వున్నాం. అలాగే వాడు ప‌లికిమాలిన పాల‌కుడు  అనీ దుర్మార్గ దారుణ పాల‌న  అనీ కొంద‌రి గురించి చ‌రిత్ర చెబుతుంది. ఆధునిక కాలంలో జ‌గ‌న్ పాల‌న‌ను  కూడా  మ‌రోలా భ‌విష్య‌త్తులో గుర్తుంచుకుంటారు.. వ‌చ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడ‌ని, బొత్తిగా అర్ధంలేని పాల‌న‌ని! మొద‌ట్లో అంతా బాగుంటుందేమో అనుకున్న‌వారికి కూడా విసిగెత్తేస్తోంది. కుమ్ములాట‌లు, విభేదాలు, ప‌థకాల అమ‌ల్లో లోపాలు, అవి నీతి, ఆర్ధిక స్థితి దెబ్బ‌తిన‌డం అన్నీ వెర‌సి జ‌గ‌న్ పాల‌ను వ‌ద్ద‌నే నినాదా నికి బ‌లం చేకూరింది.

జ‌గ‌న్ పాల‌న మూడేళ్లు ముగిసేప్ప‌టికే పార్టీలో, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అస‌లు మంత్రులు, మాజీ మంత్రుల‌కు క‌నీసం మాట్లాడ‌టం కూడా తెలీని స్థితికి జారిపోయారు. కొడాలి నాని, పేర్ని నాని, వంశీ, జోగి ర‌మేష్ త‌దిత‌రులు మామూలుగా మాట్లాడ‌టం మ‌ర్చిపోయారు.  ప్ర‌జాసేవ చేస్తా మ‌ని  ప్ర‌మా ణంచేసి మ‌రీ అధికారంలోకి వ‌చ్చిన‌వారు ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాల మాట  అటుంచితే  అస‌లు  ప్ర‌తి ప‌క్షాల‌మీద‌, ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నిస్తున్న‌వారి మీదా ఏకంగా బూతుల పురాణం వ‌ల్లిం చ‌డమేమిటి?  వైసీపీ నాయ‌కుడు ఈడీ ఆఫీసుల ప్ర‌ద‌క్షిణం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో కుమ్ములాట‌ల్లోనూ పీక‌ల్లోతు కూరుకుపోయారు.  మ‌చిలీప‌ట్నంలో బాల‌శౌరి, పేర్నినాని విభేదాలు పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీస్తున్నాయి. గ‌న్న‌వ‌రంలో వంశీని స‌మ‌ర్ధించాలా?   యార్ల‌గ‌డ్డ ను స‌మ ర్ధించాలా  అన్న‌ది వైసీపి అధిష్టానం తేల్చుకోలేక‌పోతోంది. న‌ర్సాపురం జిల్లా కేంద్రం చేయాల‌న్న డిమాం డ్ చేసిన  కొత్త‌పల్లి సుబ్బారాయుడు, ప్ర‌భుత్వ ఛీఫ్ విప్ ప్ర‌సాద రాజు మ‌ధ్య విభేదాలు వెలుగులోకి  వ‌చ్చా యి. ఇండిపెండెం ట్‌గా పోటీచేసి గెలుస్త‌న‌ని అన్న కొత్త‌ప‌ల్లిని పార్టీ నుంచి బ‌హిష్క రించారు. మ‌రో వంక  ఉమ్మడి విశాఖ జిల్లా  సమన్వయకర్త వై.వి. సుబ్బారెడ్డి టిడిపి నుంచి వ‌చ్చిన వాసుప‌ల్లి గ‌ణేష్ మ‌ధ్య విభే దాలు తీవ్ర‌స్థాయికి చేరుకున్నాయి. అంతేకాదు పార్టీ స‌మ్య‌వ‌క‌ర్త పోస్ట్‌కి  గ‌ణేష్ రాజీనామా  చేశారు. మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ  త‌ర్వాత నెల్లూరులో మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ వ‌ర్గాల మ‌ధ్య  గొడ‌వ‌లు ర‌చ్చ‌కెక్కాయి. వీరిని శాంత‌ప‌ర‌చ‌డానికి తాత‌లు దిగివ‌చ్చారు. 

ఇదిలా వుండ‌గా, ఆర్ధిక ప‌రిస్థితులు కూడా అధ్వాన్నంగా మారాయి. అధిక‌వ‌డ్డీల‌కు అప్ప‌లు తెస్తూ రాజ్యాం గ  ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతూ  రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలో ప‌డేసింద‌ని విప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నా యి. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు,  రిజ‌ర్వుబ్యాంక్‌, నీతి ఆయోగ్‌తో చేసుకున్న ఒప్పందాల గురిం చి ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేయాల‌ని  శాస‌న‌మండ‌లి సభ్యుడు, టిడిపి పోలిట్ బ్యూరో స‌భ్యుడు  య‌న‌మ‌ల రామకృష్ణ డిమాండ్ చేసారు. 14, 15 ఆర్ధిక సంఘం గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన ఆరువేల కోట్లు, జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద రాష్టానికి వ‌చ్చిన ఏడువేల కోట్లు ఏం చేశారో స్ప‌ష్టం చేయాల‌ని  య‌న‌మ‌ల డిమాండ్ చేశారు.  అస‌లు రాష్ట్రంలో ఆర్ధిక క్ర‌మ‌శిక్ష‌ణ లోపంతోనే రిజ‌ర్వుబ్యాంకు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ప‌రిమితుల మీదా ఆంక్ష‌లు విధించింద‌ని య‌న‌మ‌ల ఆరోపించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం 420 720 పేర్ల‌తో మ‌ద్యం వ్యాపా రం చేస్తున్నారేగాని రాష్ట్రంలో అస‌లు నిరుద్యోగుల సంగ‌తే ప‌ట్టించుకోవ‌డంలేద‌ని,  అన్ని వ‌ర్గాల వారిని మోసం చేస్తున్నార‌ని  రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు సోము వీర్రాజు టెక్క‌లి మ‌హాస‌భ‌లో దుమ్మెత్తిపోశారు.

దీనికి తోడు విద్యారంగాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు.  ప్ర‌తీయేటా ఉపాధ్యాయుల పోస్టుల భ‌ర్తీ చేస్తాన‌ని చేసిన ప్ర‌మాణం గాలికి వ‌దిలేసేరు.  పాఠ‌శాల‌ల విలీ నంతో ఆ సంగ‌తే మ‌ర్చిపోయారు. దీనికి తోడు ప్రాథ‌మిక పాఠ శాల స్థాయిలోనే ఇంగ్లీషు మాద్యమం అమ‌లు చేయడానికి కంక‌ణం క‌ట్టుకున్నారు. పైగా తెలుగు మీడియం కోసం ఉపాధ్యాయుల‌ను పెద్ద సంఖ్య‌లో తీసు కోవ‌ల‌సి వ‌స్తుంద‌నే  తెలుగు మీడియం ఎత్తివేసేరు. ప్రాథమిక పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల  పోస్టుల భ‌ర్తీ  వ‌దిలేసేరు. ప్ర‌ధానోపాధ్యాయుడు, పిఇటీ పోస్టులను తొల‌గించేం దుకు ఆస‌క్తిచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రాథ‌మిక విద్య‌కు ఈ ప‌రంగా అపార న‌ష్టం వాటిల్లే అవ‌కాశాలున్నా యని విద్యావేత్త‌లు, మాజీ ఉపాధ్యాయు లు విమ‌ర్శిస్తున్నారు. విద్యారంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌న్న ఆరోప ణలు విన‌ప‌డుతున్నాయి.

అస‌లు ఇలాంటి ప‌రిస్థితులు క‌ల్పించి రాష్ట్రాన్ని అస్త‌వ్య‌స్తం చేసిన జ‌గ‌న్ పాల‌నను ఎవ‌రు కోరుకుంటా రు.  ప్ర‌జ‌ల‌కు, పార్టీని అభిమానిస్తున్న‌వారికి కూడా జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల విముఖ‌త ఏర్ప‌డింది. బ‌య‌టికి చెప్ప‌క‌పోయినా చాలా ప్రాంతాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచ‌రుల్లోనూ ఈ అసంతృప్తి వుంద‌ని విశ్లేష‌కుల మాట‌. ఇపుడు రాష్ట్రంలో అంద‌రూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌స్తేనే త‌మ జీవితాలు బాగుప‌డ‌తా య‌ని, ఆశ‌లు ఫ‌లిస్తాయ‌నే భావ‌న గ‌ట్టిగా వున్న‌ది. జ‌గ‌న్ పాల‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌తో ముగుస్తుంద‌న్న వూహా గానాలు ఇప్ప‌టికే బాగా ప్ర‌చారంలో వున్నాయి.  

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.