భార్యాభర్తలు కోపాన్ని మౌనంతో వ్యక్తం చేయడం మంచిదేనా?

Publish Date:Jun 22, 2024

Advertisement

ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న తగాదాలు కూడా ఉంటాయి. ఇవి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పెంచేలా పనిచేస్తాయి. అయితే ఈ చిన్న విషయాలు ఎప్పుడు ఇద్దరి బంధాన్ని పాడుచేస్తాయో కొన్నిసార్లు  గుర్తించలేము. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోపం తెచ్చుకుంటారు. కొందరు కేకలు వేస్తారు,  కొందరు మాట్లాడి  సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కోపం రిలేషన్‌షిప్‌లో విబేధాలను సృష్టిస్తుంది.  అయితే  కొంతమంది తమ  మాటల్లోనో, చర్యల్లోనో చూపించకుండా సింపుల్ గా మౌనాన్ని ఆశ్రయిస్తారు. కానీ ఇలా మౌనంగా ఉండటం అనేది కొన్నిసార్లు సంవత్సరాల బంధాన్ని కూడా విచ్చిన్నం చేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అసలు మౌనం బంధం విడిపోవడానికి ఎలా కారణం అవుతుంది? తెలుసుకుంటే..


దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడల్లా ఒకరు మాట్లాడటం మానేయడం తరచుగా కనిపిస్తుంది. ఇలాంటి వారిలో  కోపం ఎంతగానో పెరిగిపోతుంది.  ఇలాంటి వ్యక్తులు గొడవను పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యరు. అలాగని తిరిగి భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల  భాగస్వామి హృదయం గాయపడుతుంది.  వారు ఒంటరితనం అనుభూతి చెందుతారు. దీని ప్రభావం  వైవాహిక బంధం మీద ప్రభావం చూపుతుంది.

గొడవ జరిగినప్పుడు కోపాన్ని వ్యక్తం చెయ్యడానికి బదులు మౌనాన్ని ఆశ్రయించడం అనేది భావోద్వేగాలను తారుమారు చేస్తుంది.  ఇది భార్యాభర్తల బంధంలో  చాలా చెడ్డది. గొడవ జరిగిన ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తారేమోనని ఎదుటివారి మనసులో భయాన్ని కలిగిస్తుంది.  ఈ ఆలోచన భాగస్వామిని చాలా బాధపెడుతుంది.


రిలేషన్ షిప్ లో గొడవలు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడం మంచిది కాదు. ఇలా సైలెంట్ గా ఉండటం అనేది భాగస్వామిని అవమానపరిచినట్టే.  ఇలా మౌనంగా మాట్లాడకుండా ఉండటం  వల్ల  భాగస్వామి తనను  విడిచిపెట్టేస్తారేమో అనే భావన కలిగే అవకాశం ఉంది. మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించడం వల్ల ఎదుటివారి మనసులో అనేక రకాల ఆలోచనలు రావచ్చు.  ఎదుటి వారు కూడా భాగస్వామి మాట్లాడకపోవడం వల్ల అతిగా ఆలోచించి తీవ్రమైన డిప్రెషన్,  అనూహ్య నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి జారుకోవచ్చు.


భార్యాభర్తలు ఎప్పుడూ కుటుంబ సభ్యుల కారణంగానో, స్నేహితుల కారణంగానో,  ఆర్థిక విషయాల కారణంగానో, లేదా బయటి విషయాల కారణంగానో గొడవ పడి విడిపోవడం అనే చర్య వరకు వెళ్లకూడదు.  భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాల్సినవారు.  ఒకరి విషయంలో ఒకరికి మనస్పర్థలు ఉన్నా చర్చించి పరిష్కరించుకోవాలి. అలాంటిది ఇతరుల కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం,  ఒకరిని ఒకరు వదులుకోవడం అనే చర్య వరకు వెళ్ళడం మూర్ఖత్వం.


భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు భాగస్వామితో మాట్లాడటం మానేయడం లేదా  మౌనంతోనే తమ నిరసన వ్యక్తం చేయడం వంటివి చేస్తుంటే అలాంటి అలవాటును వదిలేయడం మంచిది. భాగస్వాములు  సుఖ దుఃఖాలలో మీకు తోడుగా నిలిచేవారని గుర్తుంచుకోవాలి.   ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి కారణంగా దూరం పెరుగుతుంటే ఆ వ్యక్తిని దూరంగా ఉంచాలి తప్ప మూడవ వ్యక్తి కోసం ఇద్దరూ గొడవ పడకూడదు. భాగస్వాములు  ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ,  గౌరవం మొదలైనవాటికి అర్హులు.  ఇద్దరూ కలసి మాట్లాడుకోవడం ద్వారా  సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి,  దూరాన్ని తగ్గించుకోవాలి.  ఇద్దరి మధ్య అందమైన బంధాన్ని మరింత బలపరుచుకోవాలి.


                                              *రూపశ్రీ. 
 

By
en-us Political News

  
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.