దగ్గు మీద దాడి చేయండి!

Publish Date:Jun 7, 2016

Advertisement

 

ఎండలు తగ్గుముఖం పట్టాయి. కాస్త వర్షాలు, వాటితో పాటుగా చలిగాలులు మొదలయ్యేసరికి దగ్గు విడవకుండా పలకరిస్తుంది. ఓ నాలుగు దగ్గులు దగ్గగానే ఇక దగ్గర్లో ఉన్న ఏదో ఒక మందుల షాపు దగ్గరకి వెళ్లి సిరప్పో, మందుబిళ్లలో తెచ్చుకోవడానికి సిద్ధపడిపోతాం. వీటి వల్ల మగత, నీరసంలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశం లేకపోలేదు. కృత్రిమమైన మందుల వల్ల తాత్కాలిక లాభాలు, దీర్ఘకాలిక నష్టాలు సహజమే కదా! అందుకని ముందుగా ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించి చూస్తే పోయేదేముంది. ఏళ్లకేళ్లుగా మన పెద్దలు చెబుతున్న, ఆచరిస్తున్న ఈ చిట్కాలు మరోసారి...

 

 

తేనె:  పొడి దగ్గుకైనా, కఫంతో కూడిన దగ్గుకైనా తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మార్కెట్లో దొరికే కాఫ్‌ సిరప్‌లతో సమానంతా తేనె పనిచేస్తుందని వాదించే నిపుణులూ లేకపోలేదు. నోటి నుంచి గొంతుదాకా తేనె ఒక సన్నటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి దగ్గుని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకని తేనెని నేరుగా కానీ, గోరువెచ్చటి పాలు లేక నీటితో కానీ తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

 

అల్లం:  పొడి దగ్గుతో బాధపడేటప్పుడు అల్లం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక చిన్న ముక్క అల్లాన్ని అలాగ్గా నమిలేసినా కొంత ప్రభావం ఉంటుంది. లేదా నీటిలో ఓ నాలుగు ముక్కల అల్లాన్ని వేసి ఆ నీరు సగానికి మరిగేదాకా ఉంచి, ఆ కషాయాన్ని పుచ్చుకున్నా ఉపశమనం ఉంటుంది. అల్లం ఘాటుకి గొంతులో స్రావాల ఉత్పత్తి ఎక్కువవుతుందనీ, తద్వారా తగినంత తేమ చేరి దగ్గు తగ్గుతుందని అంటున్నారు.

 

 

పసుపు: దగ్గుకి పసుపుని వాడటం అనాదిగా వస్తున్నదే! రాత్రిపూట గోరువెచ్చటి పాలలో చిటికెడంత పసుపు వేసుకుని తాగితే దగ్గు చిటికెలో మాయమైపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. పసుపు వల్ల దగ్గు తగ్గడమూ, పాలతో సుఖంగా నిద్ర పట్టడమూ రెండూ సాధ్యమవుతాయి. ఇక ఊపిరితిత్తులలో కఫం పేరుకున్నప్పుడు వేడి వేడి నీటిలో పసుపుని వేసి ఆవిరి పట్టడం వల్ల కూడా కఫం పల్చబడిపోతుంది.

 

 

మిరియాలు: కఫంతో కూడిన దగ్గుకి మిరియాలను మించిన చిట్కా లేదంటోంది సంప్రదాయ ప్రపంచం. ఇంగ్లండు నుంచి చైనా వరకు సనాతన వైద్యంలో దగ్గుని నివారించేందుకు నల్ల మిరియాలను వాడుతూనే వస్తున్నారు. ఇందుకోసం నీటిలో కానీ, పాలల్లో కానీ పొడి చేసిన మిరియాల పొడిన కలుపుని తాగమని చెబుతుంటారు. అయితే మిరాయలు వేడిని కలిగిస్తాయి. పైగా గొంతులో కఫాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి పొడిదగ్గు ఉన్నప్పుడే వీటిని వాడాలి.

 

ఇవేకాదు... తులసి ఆకులు నమలడం, నిమ్మరసాన్ని తీసుకోవడం, బాదం పప్పులు తినడం, పుదీనా టీ తాగడం... ఇలాంటి చిట్కాలెన్నో ఇంగ్లీషు మందులకంటే అద్భుతంగా పనిచేస్తాయి.

 

- నిర్జర.

By
en-us Political News

  
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
ఈ రోజుల్లో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విలాస వస్తువు లా కాకుండా ఒక అవసరంగా మారాయి. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా,  పగలు రాత్రి తేడా లేకుండా ఏసీల చల్లని గాలిలో సమయం గడుపుతారు...
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.