సాధారణంగా, ఏ పార్టీ అయినా పార్టీకి కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే లేదా ఎంపీని ప్రోత్సహిస్తుంది. పదవులిచ్చి గౌరవిస్తుంది. అసెంబ్లీలో, లోక్ సభలో స్వేచ్ఛగా మాట్లాడి పార్టీ గొంతు, రాష్ట్ర సమస్యలు వినిపించడానికి అవకాశాలు ఇస్తుంది. అయితే.. వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎకో సిస్టమే వేరు. ఆ పార్టీలో నేతలకు దక్కే ప్రాధాన్యత పూర్తిగా అధినేత జగన్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. పనితీరు ప్రతిభ అన్నవి ఈ పార్టీలో ఎందుకూ కొరగావు. అందుకే 2014-2019 మధ్యలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎంపీగా గుర్తింపు పొందిన రఘు రామ కృష్ణరాజు వైసీపీలో వేధింపులకు గురయ్యారు. అన్యాయంగా అరెస్టై కస్టోడియల్ టార్చర్ ను అనుభవించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఔను సభలో హాజరు, సభలో ప్రజాసమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం గళమెత్తిన నేతలకు ర్యాంకింగ్ ఇచ్చే పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే ఏజెన్సీ తాజాగా 2014 -2019 మధ్య కాలంలో ఉత్తమ పనితీరు కనబరిచిన లోక్ సభ సభ్యుడిగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తిగా రఘురామకృష్ణం రాజును గుర్తించింది.
2014 - 2019 మధ్య కాలం అంటే ఏపీలో జగన్ అధికారంలో ఉన్న కాలం. ఆ కాలంలో రఘురామకృష్ణం రాజు వైసీపీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. ఆ ఐదేళ్లూ రఘురామకృష్ణం రాజు లోక్ సభలో వంద శాతం హాజరుతో దేశంలోని ఎమ్మెల్యేలందరి కన్నా ముందు వరుసలో ఉన్నారు. అలాగే ప్రజా సమస్యలు లేవనెత్తడం, వారి పరిష్కారం కోసం గళమెత్తడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. అటువంటి రఘురామకృష్ణం రాజును వైసీపీ నానా విధాలుగా వేధించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారంటూ ఇబ్బందులకు గురి చేసింది. చివరకు నాలుగేళ్ల పాటు ఆయన తన నియోజకవర్గానికి, కనీసం ఆంధ్రప్రదేశ్ కు రావడానికి అవకాశం లేకుండా చేసింది. అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేసింది. ఆ వేధింపులు భరించలేక.. రఘురామకృష్ణం రాజు 3034 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి.. తెలుగుదేశం గూటికి చేరి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/best-mp-raghurama-krishnam-raju-39-203453.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.