2014-19 కాలంలో బెస్ట్ ఎంపీ ఎవరో తెలుసా?
Publish Date:Aug 4, 2025
Advertisement
సాధారణంగా, ఏ పార్టీ అయినా పార్టీకి కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే లేదా ఎంపీని ప్రోత్సహిస్తుంది. పదవులిచ్చి గౌరవిస్తుంది. అసెంబ్లీలో, లోక్ సభలో స్వేచ్ఛగా మాట్లాడి పార్టీ గొంతు, రాష్ట్ర సమస్యలు వినిపించడానికి అవకాశాలు ఇస్తుంది. అయితే.. వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎకో సిస్టమే వేరు. ఆ పార్టీలో నేతలకు దక్కే ప్రాధాన్యత పూర్తిగా అధినేత జగన్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. పనితీరు ప్రతిభ అన్నవి ఈ పార్టీలో ఎందుకూ కొరగావు. అందుకే 2014-2019 మధ్యలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎంపీగా గుర్తింపు పొందిన రఘు రామ కృష్ణరాజు వైసీపీలో వేధింపులకు గురయ్యారు. అన్యాయంగా అరెస్టై కస్టోడియల్ టార్చర్ ను అనుభవించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఔను సభలో హాజరు, సభలో ప్రజాసమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం గళమెత్తిన నేతలకు ర్యాంకింగ్ ఇచ్చే పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే ఏజెన్సీ తాజాగా 2014 -2019 మధ్య కాలంలో ఉత్తమ పనితీరు కనబరిచిన లోక్ సభ సభ్యుడిగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తిగా రఘురామకృష్ణం రాజును గుర్తించింది. పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. అటువంటి రఘురామకృష్ణం రాజును వైసీపీ నానా విధాలుగా వేధించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారంటూ ఇబ్బందులకు గురి చేసింది. చివరకు నాలుగేళ్ల పాటు ఆయన తన నియోజకవర్గానికి, కనీసం ఆంధ్రప్రదేశ్ కు రావడానికి అవకాశం లేకుండా చేసింది. అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేసింది. ఆ వేధింపులు భరించలేక.. రఘురామకృష్ణం రాజు 3034 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి.. తెలుగుదేశం గూటికి చేరి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.
2014 - 2019 మధ్య కాలం అంటే ఏపీలో జగన్ అధికారంలో ఉన్న కాలం. ఆ కాలంలో రఘురామకృష్ణం రాజు వైసీపీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. ఆ ఐదేళ్లూ రఘురామకృష్ణం రాజు లోక్ సభలో వంద శాతం హాజరుతో దేశంలోని ఎమ్మెల్యేలందరి కన్నా ముందు వరుసలో ఉన్నారు. అలాగే ప్రజా సమస్యలు లేవనెత్తడం, వారి పరిష్కారం కోసం గళమెత్తడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
http://www.teluguone.com/news/content/best-mp-raghurama-krishnam-raju-39-203453.html





