జలాశయాల్లోకి పరిశ్రమల వ్యర్థాలు.. కమ్మేస్తున్న నురుగు
Publish Date:Oct 26, 2024
Advertisement
చెలియల కట్ట తెంచుకుని జనావాసాల మీదకు ఉరుకుతున్న సముద్రం కాదు. భారీ వర్షాలకు చెరువుకట్ట తెగి దూసుకువస్తున్న వరద ప్రవాహమూ కాదు. మరేమిటి? కమ్మేస్తున్న నురుగు. పరిశ్రమల వ్యర్థాలను ఇష్టారీతిగా జలశాయాలలోకి వదలడంతో జనాలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్న మురుగు నురుగు. ఎక్కడంటారా కర్నాటకలో. ఔను పినాకినీ నదిపై హూసూరు సమీపంలో నిర్మించిన జలాశయం నుంచి పెద్ద ఎత్తున నురుగు బయటకు వచ్చేస్తోంది. పరిసర ప్రాంతాలను కమ్మేస్తోంది. రోడ్లపైకి వచ్చేస్తోంది. రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. అసలింతకూ జలాశయం నుంచి భారీ స్థాయిలో నురుగురావడానికి కారణమేంటో తెలుసా? పరిశ్రమల వ్యర్ధాలు. బెంగళూరులోని పరిశ్రమల నుంచి వ్యర్థాలు పెద్ద ఎత్తున జలాశయంలోకి వదిలేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యానికి అత్యంత హానికరమైన వ్యర్థాలను జలాశయాలలోకి వదిలేస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పరిస్థితిని నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bengaluru-industries-residuals--into-reservoirs-39-187437.html





