మహా నరకాలు మన మహానగరాలు!

Publish Date:Sep 7, 2022

Advertisement

దేశంలో మహా గొప్పగా చెప్పుకునే నగరాల పరిస్థితి పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది. భారీ వర్షం పడితే నగరాలు నదులను తలపిస్తున్నాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు.. ఇలా ఏ నగరం తీసుకున్నా.. వాన పడితే వరదే అన్నట్లుగా ఉన్నాయి. తాజాగా భారీ వర్షాలకు బెంగళూరు నగరం నీట మునిగింది. దారులన్నీ గోదారులే అయ్యాయి. ఐటీ హబ్ గా చెప్పుకుంటున్న నగరం చిగురుటాకులా వణికిపోయింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా ఘనంగా చెప్పుకునే నగరంలో నీటి ముప్పు నుంచి జనాలను కాపాడేందుకు ప్రజలను ట్రాక్టర్లు, జేసీబీల్లో తరలించాల్సిన పరిస్థితి వచ్చింది.  విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ, బైజూ రవీంద్రన్, బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి లాంటి వారి నివాసాలకూ వరద ముప్పు తప్పలేదు. బెంగళూరుకు తాజా వరదల కారణంగా దాదాపు వేయి కోట్ల రూపాయల ఆస్త నష్టం సంభవించిందన్నది ప్రభుత్వ అంచనా. భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉన్న బెంగళూరును వరదలు ముంచెత్తాయంటే అది ప్రకృతి వైపరీత్యమని చేతులు దులిపేసుకునే అవకాశం లేదు.

అడ్డగోలు ఆక్రమణలు, చెరువుల్లో   భవనాలు, కాలువలను ఆక్రమించి మరీ నిర్మాణాలు.. రియల్టర్ల ప్రలోభాలకు లొంగి ఇష్టారీతిగా అనుమతులిచ్చుసిన అధికారుల కాసుల కక్కుర్తి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సిస్టం. వీటి కారణంగానే బెంగళూరు భారీ వర్షాలకు నీట మునిగింది. అందమైన నగరం మన బెంగళూరు అంటూ మురిసి పోతున్నామే కానీ.. నగర నిర్మాణంలో ప్రణాళికా లోపాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. బెంగళూరు ఐటీ హబ్ గా మారడంతో గత రెండు దశాబ్దాలలో నగరం భారీగా విస్తరించింది. జనాభా అంతకంతకూ పెరిగింది. అయితే మూడు దశాబ్దాల కిందట బెంగళూరులో 226 కిలోమీటర్లు ఉన్న డ్రైనేజీ సిస్టం 2017 నాటికి 110 కిలోమీటర్లకు తగ్గిపోయిందంటేనే ఎంత ప్రణాళికా రహితంగా, ఎంత అస్తవ్యస్తంగా అధికారుల తీరు ఉందో అర్ధం చేసుకోవచ్చు.నాలాల ఆక్రమణ ఏ స్థాయిలో జరిగిందో అవగతం చేసుకోవచ్చు.

ఈ కారణంగానే భారీ వర్షం పడితే నీరు బయటకు వెళ్లే మార్గం లేక కాలనీలకు కాలనీలు చెరువులైపోయాయి. దారులు గోదారులైపోయాయి. రెండేళ్ల కిందట హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ రహదారులపై మోటారు వాహనాలు కాదు పడవలు తిరిగాయి. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను పడవలలో తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. 

 రెండేళ్ల కిందట సంగతి ఎందుకు హైదరాబాద్ ను విశ్వనగరం అంటూ మురిసిపోతున్నామే కానీ.. వర్షం కురిస్తే ఇదే నగరం విశ్వనరకంలా మారిపోతుంది. ఆకాసం మబ్బు పట్టిందంటే హైదరాబాద్ నగర వాసులు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి చేరితే చాలురా బాబూ అనుకుంటున్నారు. చినుకు పడితే చాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం. ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు. ఇదీ మన విశ్వనగరం హైదరాబాద్ పరిస్థితి.

ఇప్పటికైనా ఆక్రమణల తొలగింపుపై చిత్తశుద్ధితో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెంగళూరైనా, హైదరాబాదైనా ప్రణాళికా రహితంగా నగరాల విస్తరణకు అనుమతులు ఇచ్చేసుకుంటూ పోతే ఆయా నగరాలలో జనజీవనం నరకప్రాయంగా మారుతుందనడానికి ఇప్పుడు బెంగళూరులో పరిస్థితి, రెండేళ్ల కిందట హైదరాబాద్ పరిస్థితే ప్రత్యక్ష తార్కానం.

By
en-us Political News

  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.