చలికాలంలో వాము ఆకులు తప్పక తినాలి.. బెనిఫిట్స్ ఇవే..!
Publish Date:Nov 7, 2024
Advertisement
వాము ఆకుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మందంగా ఆకుల చివర కత్తిరించినట్టుగా కనిపించే వాము ఆకులు చాలామంది ఇళ్లలోనే పెంచుకుంటారు.దీని వాసన ఘాటుగా ఉంటుంది. దగ్గు, జలుబు చేయగానే చాలామంది ఈ ఆకులను తినమని సలహా ఇస్తుంటారు కూడా. అయితే ఈ వాము ఆకులు చలికాలంలో చాలా ఉపయోగపడతాయి. చలికాలంలో జలుబు, గొంతు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కేవలం వీటికే కాకుండా వాము ఆకు మరిన్ని సమస్యలకు అద్బుతమైన ఔషదంగా పనిచేస్తుంది. వాము ఆకుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. వాము ఆకులలో కాసింత ఉప్పు పెట్టి తాంబూలంలా చుట్టి నమిలి తినాలి. ఆ తరువాత గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే కడుపునొప్పి సమస్య మంత్రించినట్టు మాయం అవుతుంది. వాము ఆకులలో విటమిన్-ఎ,సి, సెలీనియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ గా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్న కారణం వల్ల వాము ఆకులను తిన్నప్పుడు కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో యాసిడ్లకు ఇది చికిత్స చేస్తుంది. వాము ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వీటిని బాగా నమిలి తినడం వల్ల నోటిలోని బాక్టీరియా మాత్రమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. వాము ఆకులలో థైమోల్ అనే యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతాయి. ఆయుర్వేదం మహిళలకు వాము ఆకులతో గొప్ప ఆరోగ్య చిట్కా సూచించింది. ఈ ఆకులను క్రమం తప్పకుండా తింటూ ఉంటే నెలసరి సమస్య వచ్చినప్పుడు అస్సలు నెలసరి నొప్పి సమస్యే ఉండదు. వాము ఆకులలో ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి గొంతు, ముక్కులలో రద్దీని క్లియర్ చేయడంలో సహయపడతాయి. అరచెంచా వాము ఆకులు, అరచెంచా మారేడు ఆకులను కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే మధుమేహం ఉన్నవారిలో పాలీయూరియా పై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. వాము ఆకులు, తెనె, కాసింత వెనిగర్ మూడూ కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. విటమిన్-ఎ మెండుగా ఉన్న కారణంగా వాము ఆకులు తినే వారిలో కంటి చూపు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తరువాత కంటి సమస్యలు అస్సలు రాకుండా చేస్తుంది. *నిశ్శబ్ద.
http://www.teluguone.com/news/content/benfits-of-ajwain-leaves-34-166570.html





