వర్షాకాలంలో పెరుగు తినడం మంచిది కాదా? నిజానిజాలేంటంటే..!

Publish Date:Jul 17, 2024

Advertisement

 

సీజన్ ను బట్టి కొన్ని ఆహారాలు చేర్చుకోవాలని, కొన్ని అవాయిడ్ చేయాలని చెబుతూ ఉంటారు. అలా వర్షాకాలంలో తినకూడదు అని కొందరు చెప్పే వాటిలో పెరుగు ఉంటుంది.   వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటూ ఉంటారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం? దీని వెనుక కారణాలు ఏమిటి? నిజానిజాలు ఏమిటి? అనేది పూర్తీగా తెలుసుకుంటే వర్షాకాలంలో పెరుగు తినాలా వద్దా అనేది అర్థమైపోతుంది. చాలామంది ఈ వర్షాకాలంలో పెరుగు ఎందుకు తినకూడదో కొన్ని కారణాలు చెప్తారు.  అవి ఎంత వరకు వాస్తవమూ తెలుసుకుంటే..


వర్షాకాలంలో పెరుగు తినవచ్చా..?

వర్షాకాలంలో  ఆహారంలో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు తినడం చాలా మంచిది. నిజానికి ఇందులో ఉండే ప్రోబయోటిక్ కాంపోనెంట్ వల్ల సీజన్ తో సంబంధం లేకుండా జీర్ణకోశ సంబంధిత రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు తినవచ్చు.


వర్షాకాలంలో పెరుగు జీర్ణం కాదా?


పెరుగులో ఉండే ప్రోటీన్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ కారణంగా ఇది  పాల కంటే సులభంగా జీర్ణమవుతుంది.  పచ్చి పాలలో కంటే పెరుగులో ఉండే  పెప్సిన్ ద్వారా కేసైన్ ప్రోటీన్ ఎక్కువగా జీర్ణమవుతుంది. కాబట్టి వర్షాకాలంలో పెరుగు తినడం చాలా మంచిది.


రాత్రి సమయంలో పెరుగు తినకూడదా?


రాత్రిపూట  పెరుగు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇందులో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుంది.  ఇది నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల ఆందోళనను తగ్గి మెదడుకు విశ్రాంతినిస్తుందని. అయితే నిద్రకు కనీసం రెండు నుండి మూడు గంటల ముందే భోజనం పూర్తీ చేయాలి.


పాలిచ్చే తల్లులు పెరుగు తినకూడదా?


పెరుగులో క్రియాశీల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. పెరుగు లేదా పెరుగులోని ప్రోబయోటిక్  మలబద్ధకం, అతిసారం నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడతాయి.  తల్లి లేదా బిడ్డకు జలుబు లేదా దగ్గు రాకుండా చేస్తుంది.పెరుగు జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిదని.


గర్భవతులు పెరుగు తినకూడదా?


గర్భిణీ స్త్రీలు  తరచుగా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల చిన్న ప్రేగులలో జీర్ణక్రియకు పెరుగులోని బ్యాక్టీరియా అయిన లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ సహాయపడుతుంది.  కాబట్టి గర్బవతులు వారి ఆహారంలో కనీసం రోజుకు ఒకసారి  అయినా పెరుగును తీసుకోవచ్చు. అయితే ఆహారం బాగా జీర్ణం అయ్యే సమయం అయిన ఉదయం లేదా రాత్రి సమయాల్లో దీన్ని తీసుకోవడం మంచిది.


పెరుగు తింటే లావు అవుతారా?


పెరుగులో కొవ్వులు మాత్రమే కాకుండా  కాల్షియం, విటమిన్ డి, పొటాషియం,  ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి.  ఇది కాల్షియంను  గ్రహించడంలో సహాయపడుతుంది.

                                            *రూపశ్రీ. 

By
en-us Political News

  
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.