నమ్మితే నమ్మండి.. మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరార్!

Publish Date:Jun 4, 2025

Advertisement

నాన్నా పులి కథ, తెలుసు కదా.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా అలాగే వుంది. అందుకే.. ఇప్పుడు నిజంగానే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా, జనం నమ్మేలా  లేరు. సరే.. జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు. నిజానికి మాములు జనమే కాదు.. రాజకీయ వర్గాల్లో చివరకు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ జరిగితే చూద్దాంలే అన్న మాటే వినిపిస్తోంది. అవును మరి, ఒకటి  రెండు సార్లు వాయిదా అంటే ఓకే..  కానీ ఒకటికి పది సార్లు అదే  రిపీట్ అయితే..  సహజంగానే నాన్న పులి కథ గుర్తుకొస్తుంది. అయినప్పుడు చూద్దాంలే అనే అనుకుంటారు. 

అయితే..  ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణ  పక్కా అనే మాట  ఢిల్లీ వర్గాల నుంచి కొంచెం గట్టిగా వినిపిస్తోందని అంటున్నారు. నిజానికి.. ఇప్పటికే  అంతా అయిపోయిందనీ..  కేవలం లాంఛనంగా ప్రకటన  విడుదల చేయడం మాత్రమే మిగిలుందని అంటున్నారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మరి కొందరు ముఖ్యనాయకులు జూన్ 4 న ఢిల్లీ వెళుతున్నారు. అదే రోజు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత రాహుల్  గాంధీతో, ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇతర నేతలు సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ కీలక భేటీలో  ఖాయంగా  మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులతో పాటుగా..  విస్తరణ  ముహూర్తం కూడా ఫైనల్ అవుతుందని, అలాగే  టీపీసీసీ  కూర్పు కూడా  ఖరారు కావడం ఖాయమనీ  విశ్వసనీయ వర్గాల  సమాచారంగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

అయితే..  ఉహాగానాలు నిజ్జంగా నిజం అవుతాయా లేక, ఎప్పటిలానేనా?  అనే అనుమానాన్ని  పక్కన పెడితే..  తాజా సమాచరం ప్రకారం ఆశావహుల జాబితాలో ఈ సారి, నిన్న మొన్న ఎమ్మెల్సీ అయిన  రాములమ్మ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేవలం పేరు వినిపించడం మాత్రమే కాదు..  ఆల్మోస్ట్ ఖరారైనట్లే అంటున్నారు.   

నిజానికి..  కొద్ది రోజుల క్రితం హైదరాబాద్’లో  జయశాంతి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసినప్పుడే ఆశావహుల జాబితాలో ఆమె పేరు చేరింది. మీనాక్షి నటరాజన్ ను కలిసిన సందర్భంలో విజయశాంతి తన మనసులోని కోరికను బయట పెట్టినట్లు తెలిసింది. ఆ సందర్భంగా మీనాక్షి నటరాజన్ అది అధిష్టానం పరిధిలోని అంశం అంటూనే.. విషయాన్ని అధిష్టానం చెవిన వేస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆతర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ..  ఇప్పుడు  ఫైనల్ లిస్టులో ఫస్ట్ పేరు ఆమెదే అనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది. 

అదలా ఉంటే..  మంత్రి వర్గంలోకి కొత్తగా ఐదుగురిని తీసుకోవడంతో పాటుగా, మంత్రుల శాఖల్లో కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతల శాఖల్లోనే మర్పులుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఇద్దరు మంత్రుకు ఉద్వాసన తధ్యమనే  చర్చ కూడా జరుగుతోంది. అలాగే..  కుల గణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ..  అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమా చారం. ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అయితే చివరాఖరుకు ఏమి జరుగుతుందనేది ఇప్పటికీ సస్పెన్సే.. అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.