ఎపిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులైన బీద మస్తాన్ రావ్ ఈ నెల 9న (సోమవారం) తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. ఇటీవల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేతలు టిడిపి, జనసేన, బిజెపిలో చేరుతున్నారు. వారిలో ఆర్ కృష్ణయ్య ఒకరు. ఆయన వైసీపీ రాజ్యసభ సభ సిట్టింగ్ ఎంపీ. రెండోసారి కూడా వైసీపీ నుంచి టికెట్ వచ్చే అవకాశాలున్నప్పటికీ ఆయన బిజెపిలో చేరి రాజ్యసభ సీటు రెండో సారి దక్కించుకున్నారు. బీద మస్తాన్ రావ్ కూడా వైసీపీ రాజ్య సభ సిట్టింగ్ ఎంపీ. ఈయనకు కూడా రెండోసారి కూడా ఆ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశమున్నప్పటికీ స్వంత పార్టీ అయిన దేశం గూటికి చేరడం ఆసక్తికరం. ఈయన కూడా రెండో సారి రాజ్యసభ సీటు టిడిపి నుంచి దక్కించుకునే అవకాశం ఉంది. బీద మస్తాన్ రావ్ కు ఇంకా నాలుగేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన వైసీపీకి రాజీనామా చేసారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ రాజ్య సభసభ్యులు మోపిదేవి వెంటరమణ తన పదవికి ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ నవంబర్ 9న టిడిపిలో చేరనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/beda-mastan-rao-as-rajya-sabha-member-from-tdp-25-189631.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.