ఉచ్చులో పడకండి.. ఆందోళనకు దూరంగా ఉండాలంటే ఈ మార్గాలు పాలో అవ్వండి!

Publish Date:May 6, 2026

Advertisement

నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి. ఆందోళన సహజమైనదే అయినప్పటికీ, దానిని కొనసాగనివ్వడం మానసిక,  శారీరక ఆరోగ్యానికి హానికరం.  నేటికాలంలో చాలా మంది ఈ ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకున్నాక జీవితం చిన్నాభిన్నం అవుతుంది.  ఆందోళన ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. కొన్నిమార్గాలు అనుసరించాలి.  దీని వల్ల  మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనకు గురి కాకుండా ఉండగలుగుతారు.

లోతైన శ్వాస..

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రోజుకు 5-10 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం అత్యంత సులభమైన మార్గం.  లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు, శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరిగి మనస్సు ప్రశాంతమవుతుంది.  ఇది గుండె కొట్టుకోవడాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి, శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది.  ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ద్యానం..

ప్రతిరోజూ 15-20 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.  ఇది మానసిక ఏకాగ్రతను పెంచి, ప్రతికూల ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  క్రమంగా సాధన చేయడం ద్వారా  మనస్సు మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా మారుతుంది.

యోగా, వ్యాయామం..

యోగా మరియు తేలికపాటి వ్యాయామం శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచుతాయి. ఈ హార్మోన్లు సహజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా నడవడం, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్చింగ్ వ్యాయాలు లేదా సాధారణ యోగాసనాలు వేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి.

ప్రతికూల ఆలోచన..

ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూల ఆలోచనలను నింపడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన మార్గం.  ఎవరికి వారు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకోవాలి,   దేనికి కృతజ్ఞతతో ఉన్నారో గమనించాలి.  ఇది ఆందోళనను,  భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

నిద్ర, ఆహారం..

మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  నిద్రలేమి ఆందోళనను పెంచుతుంది. కెఫీన్, చక్కెర అధికంగా తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వంటివి  మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటంలో సహాయపడతాయి.

సహకారం..

మానసిక స్థితి చాలా బాగోలేదని అనిపించినప్పుడు, ఎప్పుడు ఆందోళనగా అనిపిస్తూ ఉన్నప్పుడు  కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఒంటరిగా బాధపడటం కంటే నచ్చిన వారి దగ్గర మనసు విప్పి మాట్లాడటం ద్వారా ఊరట పొందవచ్చు.

                             *రూపశ్రీ.

By
en-us Political News

  
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.