ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీ

Publish Date:Jun 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో  కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ..  ఇప్పటివరకు కేవలం సాధారణ సందర్శనలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీచ్ లు.. ఇక  అంతర్జాతీయ స్థాయి హంగులు సంతరించుకోనున్నాయి.   దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన గోవా తరహా బీచ్ సంస్కృతిని ఏపీకి పరిచయం చేస్తూ..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  బీచ్ షాక్స్ పాలసీని తీసుకువచ్చింది.  బీచ్ షాక్స్ బార్ లైసెన్స్ నిబంధనలను సవరిస్తూ జీవో జారీ చేసింది. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి కాకుండా.. ముందుగా  పైలట్ ప్రాజెక్ట్‌ కింద   పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని  సూర్యలంక బీచ్‌లో రెండు,   విశాఖపట్నం తీరంలో రెండు చొప్పున మొత్తం నాలుగు బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని  విశ్వసిస్తోంది.

అయితే..  పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం  కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, బీచ్ షాక్స్‌ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాశ్వత కాంక్రీట్ కట్టడాలను అనుమతించబోమని స్పష్టం చేసింది.  బీచ్ షాక్ వైశాల్యం కనీసం 1,000 చదరపు అడుగుల నుండి గరిష్టంగా 1,500 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలని పరిమితి విధించింది. అలాగే తీరప్రాంత నియంత్రణ మండలి  నిబంధనలు, స్థానిక ట్రేడ్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ   ఆహార భద్రతా ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.

పర్యాటక ప్రాంతాలలో శాంతిభద్రతలు, కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ బీచ్ షాక్స్‌లలో మద్యం విక్రయాలపై  స్పష్టమైన, కఠినమైన ఆంక్షలు విధించారు. ఇక్కడ సాధారణ ఐఎమ్ఎఫ్ఎల్  బ్రాండ్లు లేదా విదేశీ మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేందుకు వీలుగా కేవలం అతి తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాలైన బీర్, వైన్     అమ్మకాలకు మాత్రమే లైసెన్స్ ఇస్తారు. సమయం విషయంలోనూ కచ్చితమైన నియమాలు పెట్టారు. ఉదయం  పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఈ మద్యం సరఫరా చేయడానికి అనుమతి ఉంటుంది.  

ఈ ప్రతిష్టాత్మక బీచ్ షాక్ బార్ లైసెన్స్‌లను మొత్తం మూడేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీనికి సంబంధించిన వార్షిక లైసెన్స్ రుసుమును (75 లక్షల రూపాయలు  గా ప్రభుత్వం ఖరారు చేసింది. అంతేకాకుండా, ఈ లైసెన్స్ ఫీజుపై ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెంపు ఉంటుందని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. ఏపీ సుదీర్ఘ తీరప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా మార్చేందుకు, స్థానిక ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరియు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతూ మద్యం రవాణా కుంభకోణం కేసులో మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మరోసారి ఊహించని మలుపు తిరిగింది.
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటూనే ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు మ్యూచువల్ ఫండ్స్ (SIP)లలో నెలకు ₹12,500 చొప్పున 30 ఏళ్లు పెట్టుబడి పెడితే ఏ పథకం ద్వారా ఎంత ఎక్కువ లాభం వస్తుందో, ద్రవ్యోల్బణం ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి గణాంకాలతో తెలుసుకోండి.
తెలంగాణ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను కూడా తారుమారు చేశారంటూ ఆన్‌లైన్ వేదికల్లో ప్రచారం జరిగింది. వైసీపీ, తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల ఆధారంగా ఈ ప్రచారం ఊపందుకుంది.
సరికొత్త 2027 పోర్షే టైకాన్ (Porsche Taycan) ఈవీ అప్‌డేట్స్ వచ్చేశాయి. టెస్లా తరహా NACS ఛార్జింగ్ పోర్ట్, డ్రైవింగ్ కిక్ ఇచ్చే 8 స్పీడ్ వర్చువల్ E Shift గేర్లు, 105 kWh భారీ బ్యాటరీ మరియు AI వాయిస్ కంట్రోల్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అదరగొడుతోంది. ధర, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
విండోస్ మరియు లైనక్స్ సిస్టమ్స్‌లో మైక్రోసాఫ్ట్ 2011 సెక్యూర్ బూట్ కీస్ గడువు ముగుస్తోంది. జూన్ 2026 డెడ్‌లైన్ లోపు మీ కంప్యూటర్ మదర్‌బోర్డ్ సెక్యూరిటీని ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్ గైడ్ చూడండి.
అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యూఎస్‌సీఐఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. జూలై వీసా బులెటిన్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత EB-2, EB-3 కేటగిరీల కోసం కఠినమైన ఫైనల్ యాక్షన్ డేట్స్ నిబంధనలను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత అల్యూమినియం (VAML) షేర్లు డీమెర్జర్ మరియు మార్కెట్ లిస్టింగ్ తర్వాత తొలిసారిగా లాభాల బాట పట్టాయి. కోటక్, సిటీ వంటి దిగ్గజ బ్రోకరేజ్ సంస్థలు ఈ కొత్త స్టాక్‌పై భారీ టార్గెట్లతో కొనుగోలు పిలుపునిచ్చాయి. పూర్తి వివరాలు మరియు భవిష్యత్తు అంచనాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీకి చెందిన ప్రముఖ డయాగ్నోస్టిక్ కన్జ్యూమబుల్స్ తయారీ సంస్థ ఏవియెన్స్ బయోమెడికల్స్ ఐపీఓ జూన్ 18న ప్రారంభమైంది. జూన్ 22 వరకు సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు అవకాశం ఉంది. ఈ ఐపీఓ పూర్తి వివరాలు, రిస్క్ ఫ్యాక్టర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
విదేశీ ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నారా? మీ క్రెడిట్ స్కోర్ వీసా అప్రూవల్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎలాంటి ఆర్థిక పత్రాలను పరిశీలిస్తారో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR AY 2026-27) దాఖలు చేస్తున్నారా? కొత్త ట్యాక్స్ నిబంధనల వల్ల కొత్త ఫైలర్లు చేస్తున్న 4 ప్రధాన తప్పులు మరియు ఐటీ నోటీసుల బారిన పడకుండా ఉండటానికి నిపుణులు చెప్తున్న జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.
సిట్రోయెన్ తన సరికొత్త ఇసి3ఎక్స్ (eC3X) ఎలక్ట్రిక్ కారును కేవలం రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్యాటరీ అద్దె విధానం (BaaS మోడల్), 320 కిలోమీటర్ల మైలేజ్, పూర్తి ఫీచర్లు మరియు ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.