రుషికొండ ప్యాలెస్‌లో బాత్‌టబ్ ఖరీదు 26 లక్షలు!

Publish Date:Jun 16, 2024

Advertisement

ఆ అష్ట దరిద్రుడు జగన్ రుషికొండని తొలిచి పెద్ద పెద్ద నిర్మాణాలు ఎందుకు చేశాడో ఇంతవరకు ఎవరికీ క్లారిటీగా తెలియదు. అది ప్రజల కోసం నిర్మిస్తున్న కట్టడాలు అని వైసీపీ పిశాచాలు చెబుతూ వచ్చాయి. ఇంతవరకు ఆ కట్టడాలను చూసే అవకాశం ఎవరికీ రాలేదు. ఆదివారం నాడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోపాటు పలువురు ప్రజలు రిషికొండ కట్టడాలను చూసి ఆశ్చర్యపోయారు. అవి మామూలు కట్టడాలు కాదు.. రాజమహళ్ళు. ఇక్కడ పెట్టిన ఖర్చుకు ఒకే ఒక శాంపిల్ అందరికీ కళ్ళు తిరిగేలా చేస్తుంది. ఈ రాజమహళ్ళలో ఒకచోట ఒక బాత్ టబ్ వుంది.  దాని ఖరీదు అక్షరాలా ఇరవై ఆరు లక్షల రూపాయలు. ఒక ప్రభుత్వ భవనంలో ఇంత ఖరీదైన బాత్ టబ్ ఎవరికోసం? ఓర్నీ వైసీపీ పిశాచాల మొహాలు మండ... 26 లక్షల రూపాయల ఖరీదైన బాత్ టబ్ ఏంట్రా?

గంటా శ్రీనివాసరావుతోపాటు పలువురు రుషికొండ భవనాల్లో తిరిగి చూసి ఆశ్చర్యపోయారు. ఇవన్నీ ఏ మహారాజు, మహారాణి నివాసం ఉండటానికి, అప్పుడప్పుడు బానిసలతో సమావేశాలు జరుపుకోవడానికి కట్టుకున్నట్టు వున్నాయి తప్ప ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడేలా లేవు. మహారాజు జగన్ తన మహారాణి భారతితో కలసి నివసించడానికే రుషికొండకి గుండు కొట్టి ఈ కట్టడాలు నిర్మించారనే విషయం అర్థమైపోతోంది.

ఆ బిల్డింగులు ఏంటి? వాటిలో సదుపాయాలేంటి? అమ్మో.. ఇది కలయా.. నిజమా? మనం భూలోకంలో వున్నామా, చచ్చి స్వర్గానికి గానీ వచ్చామా అని అక్కడకి వెళ్ళిన వాళ్ళు అందరూ తమను తాము గిల్లుకుని కన్ఫమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

కొంచెం ఇంటర్నేషనల్ చరిత్రలోకి వెళ్దాం.. ఫిలిప్పీన్స్ దేశాన్ని మార్కోస్ అనే నియంత చాలాకాలం పరిపాలించాడు. ఆయన గారి భార్య ఇమెల్డా మార్కోస్. మన రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలన ఎలా అంతమైందో, ఫిలిప్పీన్స్.లో కూడా ఓ ఫైన్ మార్నింగ్ మార్కోస్ పాలన అంతమైంది. అప్పటి వరకు మార్కోస్ ప్యాలెస్‌లో ఏముందో బయటివాళ్ళకి ఏమీ తెలియదు. మార్కోస్ పాలన ముగిసిన తర్వాత ఆ ప్యాలెస్‌లోకి వెళ్ళి చూసిన జనానికి కళ్ళు తిరిగిపోయేంత వైభవం కనిపించింది. మార్కోస్ పెళ్ళాం గారు అయిన ఇమెల్డాకి వేల సంఖ్యలో చెప్పులు... వాటిని ఉంచడానికి ఒక భవనం ఉన్నాయంటే మార్కోస్ ఏ రేంజ్‌లో వైభవాన్ని అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన జగన్, అండ్ భారతిలను ఆంధ్రా మార్కోస్ దంపతులుగా జనం అనుకుంటున్నారు.

ఫిలిప్పీన్స్.లో మార్కోస్ మాత్రమే కాదు.. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ నియంతృత్వం ముగిసినప్పుడు, లిబియాలో నియంత గడాఫీ శకం అంతమైనప్పుడు కూడా వారి నివాస భవనాలకు వెళ్ళి చూసిన ప్రజలు వామ్మో అని ఆశ్చర్యపోయారు. జనం ఎన్ని కష్టాలు పడుతున్నా, జనం డబ్బుతో వైభవాన్ని అనుభవిస్తూ వచ్చారు ఈ నియంతలు. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్ కూడా వాళ్ళకంటే తక్కువ వాడేమీ కాదు అన్నట్టుగా రుషికొండ మీద భవనాలు వున్నాయి.

ప్రజాస్వామిక నియంత జగన్ దుర్మార్గపు పాలన అంతమైపోయింది. అతని పరిపాలనలో జరిగిన ఒక్కో విషయం బయటపడటం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వుంటుందో... ఆంధ్రుడా.. ప్రిపేర్ అయి వుండు!

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.