తొలి స్నానంతో తనువు చాలించాడు

Publish Date:Oct 27, 2022

Advertisement

ఒక్కపూట సరిగా స్నానం చేయకుంటే మహా చిరాగ్గా ఉంటుందిరా అబ్బాయ్ అంటాడు పెద్దాయన, అబ్బా ఈ పూట కాదులేమ్మా,, రేపు తలస్నానం చస్తాలే.. అంటుంది కూతురు.. కనీసం కాళ్లన్న కడు క్కుని వచ్చి తినరా అని  బతిమి లాడుతుంది కొడుకుని తల్లి.. ఇది చాలా రోటీన్.. కానీ 94 ఏళ్ల హాజీని అలా ఎవ్వరూ అడగలేదు, వేధించనూ లేదు. హాయిగా ఇన్నాళ్లూ ఒక్క మగ్గు నీళ్లు కూడా ఒంటిమీద పోసుకోకుండానే జీవించాడు. మొన్నీ మధ్యనే స్నానం చేశాడు.. అదే తొలి, ఆఖరి స్నానం అయిందా యనకి. స్నానం చేసిన కొన్ని నెలలకు మరణించాడు. 

ఇరాన్ ఫార్స్ దక్షిణ ప్రాంతంలోని డెగ్జా  గ్రామంలో ఊరికి దూరంగా ఒక గుట్టమీద ఎవ్వరికీ పట్టని చిన్న ఇటుకల గూడు లాంటి దానిలో ఉండేవాడు. ఆయనకు  స్నానం  తెలియదు, బట్టలు  ఒంటి  మీద ఉన్నవే. దుస్తులతో పాటు  రెండు పొరల మేర మురికి పట్టి ఉండేవాడు. గత అరవయ్యేళ్లుగా  ఆయన స్నానం  చేయలేదంటే నమ్మండి. అందుకే ఆయన్ను అంతా లోకంలో అందరికంటే మురికి మనిషి అన్నారు. 

ఆయన 60 యేళ్లుగా స్నానం చేయకపోవడానికి కారణం ఆయన యవ్వనంలో  ఏవో సంఘటనల కారణంగా నీళ్లు, సబ్బుతో స్నానం చేయడం మానేశాడని డెగ్జా గ్రామస్తులు చెబుతుంటారు. ఎవరన్నా బకెట్ నీళ్లు ఇచ్చినా నిరాకరించే వాడట. ఫలితంగా ఒళ్లంతా పుళ్లుతో దారుణంగా తయారయ్యాడు. హాజీకి సిగరెట్లు తాగడం అంటే యిష్టం. ఎవరయినా అటుగా వెళ్లినపుడు ఒక్కటిస్తే పారేసేవాడు.. కనీసం నాలుగయిదు ఒక్కసారిగా పీల్చేయడం యిష్టం. హాజీ ఉన్న ప్రాంతంలో దొరికే జంతు అవశేషాలు తినేవాడట, ఆకులు చుట్టి సిగెరెట్లా తాగేవాడట. 2014లో  ఒకసారి డెగ్జా గ్రామస్తులు కొందరు వెళ్లి మంచి ఆహారం, నీళ్లు ఇస్తే వాటిని చూసి భోరున ఏడ్చేశాడట.  శుభ్రంగా ఉండటానికి ప్రయత్నించినా అతనికి దిగులు కమ్ముకుంటుందిట.  నిజంగానే అతని జీవితంలో ఏదో ఊహించని పెద్ద సంఘటనే అతన్ని ఈ స్థితికి తీసుకువచ్చిందని అంటారంతా. కానీ ఎవరూ అడిగే ధైర్యం చేయరు, ఎవర్నీ దగ్గరికి రానీయడు. 

కానీ కొన్ని నెలల క్రితం గ్రామస్తులు బలవంతంగా  ఆయనకు స్నానం చేయించి, మంచి ఆహారం పెట్టి, మంచినీళ్లు తాగించారు. తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. గత  ఆదివారమే మరణిం చాడు. చిత్రంగా ఉంది కదూ.. అరవయ్యేళ్ల తర్వాత మొదటిసారిగా స్నానం చేసిన ఆనందం లేదు.. అదే చివరి స్నానం అయింది. 

By
en-us Political News

  
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.