క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి

Publish Date:Jun 21, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో  బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు..

సోమవారం రజతోత్సవాలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు..

 క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రారంభమైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోకూడదన్న ఆలోచనతో బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో రూపుదిద్దుకుంది ఈ సంస్థ. 

ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను తక్కువ ఖర్చుతో, లాభాపేక్ష లేకుండా అందించాలన్న లక్ష్యంతో దివంగత నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో 1988లో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. వైద్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రవాస భారతీయులు, దాతల సహకారంతో ట్రస్ట్ ఏర్పాటుకు పునాదులు పడగా, 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా 100 పడకలతో ఆస్పత్రి ప్రారంభమైంది. అనంతరం సేవల విస్తరణకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో దేశంలోనే ప్రముఖ సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనా కేంద్రంగా ఎదిగింది.

పేదల ఆస్పత్రి బసవ తారకం

గత పాతికేళ్లుగా సేవాభావం, మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తూ బసవతారకం ఆస్పత్రి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రోగులు బసవ తారకం ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతేడాది 3 లక్షల మందికి పైగా అవుట్‌పేషెంట్లు, సుమారు 90 వేల మంది ఇన్‌పేషెంట్లకు ఆస్పత్రి సేవలందిస్తోంది. ఇప్పటివరకు 8 వేలకుపైగా క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగా, 86 బోన్ మ్యారో మార్పిడి చికిత్సలు నిర్వహించారు. 

క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయించే వారిలో 65 శాతం మందికిపైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తక్కువ వ్యయంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడం వల్ల పేదల ఆస్పత్రిగా బసవతారకం పేరు పొందింది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్–పీఎం జే (PM-JAY)తో పాటు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోని లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడంలో ఆస్పత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. 

ప్రస్తుతం సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు రేడియాలజీ, పాథాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, మెడికల్ ఫిజిక్స్, పరిశోధన మరియు అభివృద్ధి విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు, సాంకేతిక నిపుణులు సేవలందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సుమారు 250 మంది వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు సేవలందిస్తున్నారు.

స్క్రీనింగ్ బస్ ద్వారా గ్రామాల్లో క్యాన్సర్ బాధితులకు సేవలు

తల, మెడ, రొమ్ము, సర్వికల్, ప్రొస్టేట్ క్యాన్సర్లతో పాటు వివిధ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లకు సమగ్ర చికిత్సలను ఈ ఆస్పత్రిలో అందిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నొప్పి నివారణ, సంపూర్ణ సంరక్షణకు సేవలు అందించే ప్రత్యేక పాలియేటివ్ కేర్ యూనిట్‌ను ఆస్పత్రి నిర్వహిస్తోంది. చికిత్సతో పాటు బాధితులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలను చేపడుతోంది. 

క్యాన్సర్ నివారణకు ముందస్తు గుర్తింపు, విస్తృత స్థాయి స్క్రీనింగ్ కార్యక్రమాలు జాతీయ ప్రాధాన్యతగా మారాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలను ఆస్పత్రి నిర్వహిస్తోంది. డిజిటల్ మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే సదుపాయాలు కలిగిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ద్వారా వైద్య సేవలను ఆస్పత్రికే పరిమితం చేయకుండా గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల వద్దకే తీసుకెళ్తోంది. 

ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైద్య సేవలతో పాటు మానవత్వం, కరుణ, సేవాభావాన్ని మేళవిస్తూ క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సేవా దృక్పథంతో కూడిన వైద్య రంగ సంస్థగా గుర్తింపు పొందింది. దాతృత్వం, వైద్య నిపుణుల ప్రతిభ, సమాజం వైపు నుంచి లభించే మద్దతు, ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ క్యాన్సర్‌పై సమర్థవంతమైన పోరాటం చేయవచ్చని ఈ సంస్థ తన 25 ఏళ్ల ప్రస్థానంతో చాటిచెప్పింది. 

భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవలను అందించాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించేలా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవాలను నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు బసవ తారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు మొదలు పెట్టగా... ఆయన వారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా భావిస్తున్నారు. 

ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం ఆస్పత్రి పేదలకు మరిన్ని అత్యాధునిక సేవలను అందిస్తోంది. క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక వైద్య సేవలను మానవత్వం, సేవాభావంతో అందిస్తూ దేశంలోనే గుర్తింపు పొందిన ఈ వైద్యసంస్థ రజతోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వైద్య నిపుణులు, దాతలు, ఆస్పత్రి సేవలతో అనుబంధం కలిగిన అతిథులు హాజరు కానున్నారు.
 

By
en-us Political News

  
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.