జగన్ గాలి తీసేసిన బర్రెలక్క!

Publish Date:Dec 20, 2023

Advertisement

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేసే క్రమంలో ఎప్పుడో గీత దాటేశారు. ఆయనొక సీఎం అని.. ఒకరిపై విమర్శలు చేసే క్రమంలో హుందాగా వ్యవహరించాలన్న ఇంగితం ఆయన మరచిపోయారో లేదా అసలు ఇంగితం అన్నది ఆయనకు లేదో తెలియదు కానీ, ఆయన సీఎం అన్న విషయం మరచిపోయి నేతలు, ఎమ్మెల్యేలతో కలిసిపోయి  తన స్థాయిని తానే దిగజార్చుకుని మాట్లాడుతున్నారు.  ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడమే కాకుండా వెటకారపు నవ్వుతో హేళన చేయడం తన నైజంగా  మార్చుకున్నారు.  

ఉమ్మడి రాష్ట్రంలోనే, ఆ మాటకు వస్తే జాతీయ స్థాయిలో సైతం అపార రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు లాంటి వ్యక్తిని ముసలాయనకి వయసైపోయిందంటూ  సీఎం కుర్చీలో కూర్చొని హేళనగా మాట్లాడిన జగన్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయంపై కూడా వెటకారపు వ్యాఖ్యలు చేశారు. మనిషై పుట్టాక ప్రతి ఒక్కరికి వయసు అయిపోతుంది.. అందరూ వృద్ధులే అవుతారు. కానీ  దానిని మరిచి జగన్ నోరు పారేసుకున్నారు. ఇక పవన్ విషయంలో కూడా అంతే. పవన్ పెళ్లిళ్లపై జగన్ వ్యాఖ్యలు చేయగా.. జగన్ ముత్తాల నుండి వారి వంశంలో ఒకటికంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయి.

 ఇప్పుడు జగన్ మరోసారి తెలంగాణలో జనసేన పోటీపై కూడా వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో  సందర్భంగా కాశీబుగ్గ బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి   ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇక్కడ చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై జగన్ విమర్శలు చేశారు. దత్తపుత్రుడిగా యాక్టర్ ను పెట్టుకొని డ్రామాలు ఆడతారంటూ చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన పోటీపై కూడా మాట్లాడిన జగన్.. పవన్ అభ్యర్థులను నిలబెడుతూ, తెలంగాణలో అన్నమాటలు వింటే ఆశ్చర్యం అనిపించిందన్నారు. తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానని.. అది తన దురదృష్టం అన్నారని.. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇంకొక పార్టనర్ అంటూ విమర్శించారు. చివరికి ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదని.. డిపాజిట్లు కూడా రాలేదంటూ విమర్శించారు.  

ఈ  వ్యాఖ్యలపై తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బర్రలక్క హుందాగా కౌంటర్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ పవన్ ను ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో తన ప్రస్తావన తీసుకురావడాన్ని బర్రెలక్క ఖండించారు. ఇంకా చెప్పాలంటే బర్రెలక్క జగన్ గాలి తీసేశారు. జగన్ అనుచిత వ్యాఖ్యలపై బర్రెలక్క.. ఎవరి పార్టీ వారిది.. ఎవరి రాజకీయ జీవితం వారిది.. జగన్ పవన్ కల్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడటం బాధగా అనిపించిందని అన్నారు. ఎవరి స్థాయి వాళ్ళది.. ఆయన పవర్ ఆయనది.. నా పవర్ నాది.. నేను కూడా పవన్ అభిమానినే. పవన్ కళ్యాణ్ ఎంత మంచోడో జనాలకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం తక్కువ చేయడం కోసం నాతో పోల్చటం బాధగా ఉంది. పవన్ కల్యాణ్ గ్రేట్ పర్సన్.. ఆయన్ను నేను ఎంతో అభిమానిస్తాను. ఆయన్ను మైనస్ చేయటం కోసం సీఎం స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి నా ప్రస్తావన తీసుకురావటం మంచిది కాదని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న జనసైనికులు బర్రెలక్క వ్యాఖ్యలతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానినని గర్వంగా చెప్పుకున్న బర్రెలక్కకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి తనకు కూడా దమ్ము ఉందని నిరూపించుకుందనీ,  వైసీపీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము లేక అక్కడ నుండి బిచాణా ఎత్తేసిందనీ ఎద్దేవా చేస్తున్నారు. అసలు వైసీపీ కనీసం పోటీ కూడా చేయని చోట.. పోటీకి దిగి తన ఉనికి కోసం ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ పై జగన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని రాజకీయ వర్గాలలో కూడా నిరసన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా బర్రెలక్కతో పోల్చి జగన్ చేసిన వ్యాఖ్యలు.. దానికి బర్రెలక్క కౌంటర్లు చూసినోళ్లు.. బర్రెలక్క ప్రస్తావన తీసుకురావటం ద్వారా సీఎం జగన్ తప్పు చేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బర్రలక్క వ్యాఖ్యలు జగన్ రాజకీయ అవగాహనా రాహిత్యాన్ని బట్టబయలు చేశాయని అంటున్నారు. బర్రెలక్క హుందాగా జగన్ వ్యాఖ్యలను ఖండించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.