బీజేపీకి పీడకలగా మారిన బంకీపూర్, దతియా ఓటములు.!

Publish Date:Aug 4, 2026

Advertisement

బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలతాలు బీజేపీకి పీడ కలనే మిగిల్చాయి.  బీజేపీకి కంచుకోటలు, అత్యంత సురక్షిత స్థానాలుగా గుర్తింపు పొందిన రెండు స్థానాలలోనూ కూడా ఉప ఎన్నికలో బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 

  బీహార్‌లోని బంకిపూర్  అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ దాదాపు 20 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా, సిన్హా 44,827 ఓట్లు సాధించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై  ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. తివారీకి 60,741 ఓట్లు రాగా, సింగ్‌కు 66,757 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఫలితాలూ కూడా బీజేపీ ప్రజాదరణ కోల్పోతోందన్న సంకేతాలను బలంగా ఇచ్చాయి.  

ముందుగా బంకీపూర్ విషయాన్ని తీసుకుంటే.. ఈ నియోజకవర్గం.. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నితిన్ నబిన్సొంత నియోజకవర్గం.అంతే కాదు  బీజేపీకి అత్యంత సురక్షితమైన సీట్లలో ఒకటి. 1995 నుంచి బీజేపీ ఈ సీటు గెలుచుకుంటూనే వస్తోంది. అటువంటి స్థానంలో బీజేపీ ఓటమి.. మోడీ పాలనపై ప్రజావ్యతిరేకతకు బలమైన సందేశంగా నిస్సందేహంగా చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు.  ఇలా ఎందుకు చెప్పొచ్చంటూ.. బంకీపూర్ లో కానీ, దతియా నియోజకవర్గంలో కానీ జరిగినది ఉప ఎన్నిక. సాధారణంగా ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పార్టీలు సునాయాసంగా గెలిచేస్తాయి. బీహార్, మధ్య ప్రదేశ్ లో  బీజేపీయే అధికారంలో ఉంది.     

హస్తినలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, పోరాటం వల్ల మోడీ ప్రతిష్టకు కలిగిన నష్టం ప్రభావం కూడా బంకీపూర్, దతియా ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమికి కారణమైందని చెప్పొచ్చు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ల ఆందోళన, నిరసనల సమయంలో  ప్రధాని మోదీపై బహిరంగ విమర్శలు బ్రాండ్ ను మసకబార్చాయి.   అలాగే.. బంకిపూర్,  దతియా  ఫలితాలు నిరుద్యోగం, విద్య, విద్యార్థులపై పోలీసుల చర్యలపై ప్రజలో వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలకు దర్పణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Bankipur and Datia defeats nightmare to BJP, Modi, Pride, Diminish

By
en-us Political News

  
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.