భారత్ తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకే కుప్పకూలిన బంగ్లాదేశ్
Publish Date:Dec 22, 2022
Advertisement
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మీర్ పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం(డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. రెండు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టులో పరాజయం పాలై 1-0తో వెనుక బడిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలన్న లక్ష్యంతో టాస్ గెలిచి రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు విజృంభించడంతో 277 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లా బ్యాటర్లలో మామినుల్ హల్ (84) మాత్రమే రాణించాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా ఉనాద్కత్ కు రెండువికెట్లు దక్కాయి. తరువాత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్ట పోకుండా 19 పరుగులు చేసింది.
http://www.teluguone.com/news/content/bangladesh-all-out-for-low-score-in-1st-innings-25-148910.html





