బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. తగాదా తీర్చెదెలా.. అధిష్ఠానం మల్లగుల్లాలు!

Publish Date:Jan 6, 2025

Advertisement

తెలంగాణలో బీజేపీ పయనం బావిలో కప్ప మాదిరిగా తయారైంది.  రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతోంది. అధికారమే తరువాయి అన్నట్లుగా ఒక సమయంలో బలంగా కనిపించిన ఆ పార్టీ ఆ తరువాత బలహీనపడింది. దక్షిణాదిన బలోపేతం కావడానికి  ఆశాదీపంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ భావిస్తోంది. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా.. రాష్ట్రానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం క్యూ కట్టి మరీ రాష్ట్రానికి వచ్చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కూడా ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనాయకత్వం అంతా తెలంగాణలో పార్టీ కోసం గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఆ పార్టీ ఆ రెండు ఎన్నికలలోనూ చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించినా, రాష్ట్రంలో అధికారం అన్న కల మాత్రం నెరవేరలేదు. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనైనా అత్యధిక స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నది. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో పెచ్చరిల్లిన విభేదాల కారణంగా ఆ ఆశ నిరాశ కాకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలో అంతర్గత విబేధాలకు ప్రధాన కారణం.. అగ్రనాయకత్వం ముందు వెనుకలు ఆలోచించకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకుని కీలక  పదవులు అప్పగించడమే కారణమని అంటున్నారు. ఆ కారణంగానే   పార్టీలో కొత్త, పాత నేతల మధ్య పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. దీంతో కింకర్తవ్యం అని పార్టీ అధిష్ఠానం తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఉంది.  పార్టీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కూడా ముందువెనుకలాడాల్సిన పరిస్థితి నెలకొంది. పాతవారిని సముదాయించలేక, కొత్త వారిని నియంత్రించలేక నానా ఇబ్బందులూ పడుతోంది.  

 కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ ఎప్పుడో అంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెంటనే ప్రకటించింది. అయినా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అందుకు కారణంగా పార్టీలోని అంతర్గత విభేదాలే అనడానికి ఇసుమంతైనా సంకోచించాల్సిన అవసరం లేదు. 

గత రెండు నెలల కిందటి వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి రేసులో ముగ్గురు నుంచి నలుగురు ఉన్నప్పటికీ అనేక వడపోతల తరువాత రేసులో ప్రధానంగా ఈటల రాజేందర్ నిలిచారు. అయితే పార్టీలోనూ, పార్టీ క్యాడర్ లోనూ మంచి పట్టు ఉన్న కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడూ బండి సంజయ్ అడ్డుగా నిలుస్తున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటల తప్ప మరెవరైనా అభ్యంతరం లేదని ఆయన పార్టీ హైకమాండ్ వద్ద గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు  ఎట్టి పరిస్థితుల్లోనూ బయటనుంచి వచ్చి చేరిన వారికి అప్పగించడానికి తాము అంగీకరించబోమని పార్టీలోనిహిందూ హిందుత్వ వాదులతో పాటు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ వంటి సంస్థలూ పట్టుబడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి వరకూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను అనూహ్యంగా బీజేపీ హైకమాండ్ మార్చేసింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. ఆ మార్పు వెనుక ఉన్నది ఈటల రాజేందర్ అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో పార్టీ చేరికల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఈటల రాజేందర్ కు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ అడుగడుగునా అడ్డు పడ్డారనీ, ఆ కారణంగానే ఈటల పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలకు చేసిన ప్రయత్నాలు ముందుకు సాగలేదనీ ఈటల వర్గీయులు అప్పట్లో ఆరోపణలు గుప్పించారు.  అప్పటి నుంచీ ఇరువురి మధ్యా ఉప్పూ నిప్పు అన్న చందంగానే సంబంధాలు ఉన్నాయి. 

ఆ కారణంగానే ఈటలకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ ఇప్పుడు ముందువెనుకలాడుతోందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే తెలంగాణ సమాజంలో గుడ్ విల్ ఉండటం, బీసీ నేత కావడంతో ఈటలకు పగ్గాలు అప్పగించడమే మేలని హైకమాండ్ భావిస్తోందనీ, అదే సమయంలో తొలి నుంచీ బీజేపీలో ఉన్న బండి సంజయ్ మాటను తోసి రాజనే ధైర్యం కూడా బీజేపీ హైకమాండ్ చేయడం లేదని అంటున్నారు. బండి సంజయ్, ఈటల మధ్య సయేధ్య కోసం పార్టీ పెద్ద తలకాయలు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కిరావడం లేదనీ, అందుకే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నియామకం విషయంలో నెలల తరబడి జాప్యం జరుగుతోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈటలకు పదవి ఇస్తే బండి ఇన్ యాక్టివ్ అవుతారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులూ కాడె వదిలేస్తారు. పోలీ ఈటలను పక్కన పెడదామంటే ఆయన పార్టీనే వదిలేస్తారు.  ఈ రెండూ కూడా  ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు.  ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.    

సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత అయిన ఈటలను వదులు కుంటే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని బీజేపీ హైకమాండ్ భయపడుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టాలన్న ఆ పార్టీ ఆశ నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని ఈటలకు పెద్ద పీట వేస్తే తెలంగాణలో బీజేపీ కుదేలౌతుంది. ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలో కొనసాగుతున్న బండి వంటి నేతలు పార్టీకి దూరమౌతారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. దీంతో ఎటూ తేల్చుకోలేక బీజేపీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది.   పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పును వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఈ సమస్యను రానున్న రోజులలో ఎలా అధిగమిస్తుందో చూడాల్సిందే. 

By
en-us Political News

  
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.