తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ప్రజా సంగ్రామయాత్రలో ఉన్న ఆయన అకస్మాత్తుగా పాదయాత్రకు విరామం ప్రకటించి మరీ హస్తినకేగడానికి గల కారణమేమిటనే విషయంలో ఒకింత సందిగ్ధత ఏర్పడినా ఆయన ఉప రాష్ట్రపతి ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఢిల్లీకి బయలుదేరారని పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారు. తన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా మునుగోడులు ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు బండి సంజయ్ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వినించే అవకాశం ఉంది.
ఈ నెల 21న బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగించనున్నారు. ఆ సందర్భంగా మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకీ, మునుగోడు శాసన సభ సభ్యత్వానికి కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ముగుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. కమలంగూటికి చేరి మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, మునుగోడులో పార్టీ విజయావకాశాలపై బండి సంజయ్ నడ్డా, అమిత్ షాలకు వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మరి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలకు అవకాశం ఉదనే అంచనాల నేపథ్యంలో బండి సంజయ్ హస్తిన యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandi-sanjay-take-a-break-in-padayatra-to-go-to-delhi-39-141358.html
Publish Date:Oct 11, 2026
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
Publish Date:Oct 11, 2026
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ