సీఎంవోలో మూడో పవర్ సెంటర్! యువ నేతల మధ్య వార్? 

Publish Date:Nov 9, 2020

Advertisement

ఆ ఇద్దరు యువ నేతలు. ఒకరు మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాలనలో చక్రం తిప్పుతున్నారు. మరొకరు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులుగా ఉంటున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య  ముందు నుంచి సఖ్యత బాగానే ఉండేది. కాని ప్రస్తుతం ఆ ఇద్దరు యువ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇవే కామెంట్స్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. 

 

ఆ ఇద్దరు యువనేతలు ఎవరో కాదు.. ఒకరు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాగా... మరొకరు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. కేటీఆర్, సంతోష్‌రావుల మధ్య పంచాయితీ నడుస్తోందంటూ తాజాగా బాంబు పేల్చారు బండి సంజయ్. ముఖ్యమంత్రి పీఠం కోసం ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సంజయ్ వ్యాఖ్యలు గులాబీ పార్టీలో గుబులు రేపుతుండగా.. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఇందులు బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు. 

 

సీఎంవోలో మూడో పవర్ సెంటర్ గా ఎంపీ సంతోష్ కుమార్ మారిపోయారనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. సీఎంవోలో సీఎం కేసీఆర్ కు మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ ఐఏఎస్ నర్సింగ్ రావులు కీలకంగా ఉన్నారు. వారితో పాటు మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. వారంతా సీఎం సెంటర్ గా పనిచేస్తారని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ కూ సీఎంవోతో పాటు ఉన్నతాధికారుల్లో సెపరేట్ టీమ్ ఉందని తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ లు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్ లు కేటీఆర్ సెంటర్ లో ముఖ్యలని చెబుతారు. అయితే కొన్నిరోజులుగా ఎంపీ సంతోష్ కు మద్దతుగా మరో వర్గం తయారైందనే ప్రచారం జరుగుతోంది. సీఎంవోతో పాటు సచివాలయంలోనూ సంతోష్ కోటరి బలంగా ఉందని కొందరు టీఆర్ఎస్ నేతలే అఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. 

 

నిజానికి గతంలో సీఎం కేసీఆర్ పర్యటనలు, ఆయన వ్యక్తిగత నిర్ణయాల వరకే సంతోష్ కుమార్ చూసేవారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు ఉండేవారు. అయితే రాజ్యసభకు పంపించాక ఆయనలో మార్పు వచ్చిందంటారు. ఇప్పుడు కేసీఆర్ కార్యక్రమాలు చూడటంతో పాటు పార్టీ, ప్రభుత్వ  పాలనా వ్యవహరాల్లోనూ సంతోష్ కుమార్ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. గతంలో ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లు పోస్టింగులు, ప్రమోషన్ల కోసం కేటీఆర్ ను కలిసివారు.. ఇప్పుడు సంతోష్ తో కూడా తమ పని జరుగుతుందని వారు చెబుతున్నారట. అందుకే ఎప్పడూ బిజీగా ఉండే కేటీఆర్ కంటే సంతోష్ తో పని చేయించుకోవడమే బెటరనే అభిప్రాయం అధికారుల్లో ఉందంటున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా సంతోష్ ను పవర్ సెంటర్ గా చూస్తున్నాయని తెలుస్తోంది. ప్రమోషన్లు, బదిలీల కోసం కేటీఆర్ తో పాటు సంతోష్ కు కలుస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది.

 

గతంలో సినీ, రాజకీయ ప్రముఖులంతా మంత్రి కేటీఆర్ చుట్టూనే తిరిగేవారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రావాలన్నా, సర్కార్ నుంచి రాయితీలు అడగాలన్నా అందరూ కేటీఆర్ దగ్గరకే వచ్చేవారు. కాని ఇప్పుడు కొందరు వ్యాపార, సినీ ప్రముఖులు ఎంపీ సంతోష్ ను  ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా ఆయనకు బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ, వ్యాపర దిగ్గజాలతో సంతోష్ కు పరిచయాలు పెరిగాయని, దీంతో ఆయన ఇమేజీ కూడా పెరిగిందనే చర్చ జరుగుతోంది. మీడియాను కూడా సంతోష్ మ్యానేజ్ చేస్తున్నారని, అందుకే ఆయన కార్యక్రమాలకు మంచి కవరేజ్ లభిస్తుందని చెబుతున్నారు. 

 

మొత్తంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవల కాలంలో తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు పార్టీ, ప్రభుత్వ వ్యవహరాల్లో కీలకంగా మారారని కేటీఆర్ టీమ్ కూడా గుర్తించిందని అంటున్నారు.  సంతోష్ రావు తీరుపై కేటీఆర్ వర్గం గుర్రుగా ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. ఇందుకు బలాన్నిచ్చేలా బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీని కలవర పరుస్తుందంటున్నారు. మొత్తానికి కేటీఆర్, సంతోష్ మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం ఆధిపత్య పోరు సాగుతుందనే సంజయ్ కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లోనూ, కారు పార్టీల్లోనూ కాక రేపుతున్నాయని చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.