Chennai: దేశ రక్షణలో బీఎస్ఎఫ్ కీలక పాత్ర: బండి సంజయ్

Publish Date:Sep 25, 2026

Advertisement

చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.! 

 దేశ రక్షణలో బీఎస్ఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలైట్లు, దేశ వ్యతిరేక శక్తులపై పోరాటంలో బీఎస్ఎఫ్ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. చెన్నైలోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్తగా నిర్మించిన పలు భవనాలను బండి సంజయ్ ప్రారంభించారు. రూ.11.07 కోట్లతో నిర్మించిన పరిపాలనా భవనం, రూ.4.74 కోట్లతో నిర్మించిన గెజిటెడ్ అధికారుల భవనం, రూ.9.86 కోట్లతో నిర్మించిన సిబ్బంది బ్యారక్, రూ.5.30 కోట్లతో నిర్మించిన సబార్డినేట్ అధికారుల భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బీఎస్ఎఫ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 2014లో చెన్నై–మల్కాన్‌గిరి సెక్టర్ ఏర్పడినప్పటి నుంచి బీఎస్ఎఫ్ సిబ్బంది నక్సలైట్లు, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జవాన్లు చూపిస్తున్న ధైర్యం, అప్రమత్తత, అంకితభావం అభినందనీయమన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు రక్షణ గోడలా నిలిచి దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు. వారి సేవల వల్ల మల్కాన్‌గిరి ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి పరిస్థితులు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు.దేశ సరిహద్దులను కాపాడే జవాన్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని బండి సంజయ్ తెలిపారు. జవాన్లు ఎలాంటి వాతావరణంలోనైనా విధులు నిర్వహి స్తున్నారని, వారికి మెరుగైన వసతి, విశ్రాంతి, పరిశుభ్రత, ఇతర మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

చెన్నైలో ప్రారంభించిన కొత్త భవనాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని, దేశం కోసం పనిచేస్తున్న జవాన్ల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇవి నిదర్శనమని అన్నారు. విధులు ముగించుకున్న తర్వాత జవాన్లు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని, మరింత ఉత్సాహంతో విధుల్లో పాల్గొనేలా మంచి వాతావరణం కల్పించడమే లక్ష్యమని వివరించారు. దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది, వారి కుటుంబాలకు చెన్నై సెక్టర్ ద్వారా వైద్య, విద్య, సంక్షేమ, పరిపాలనా సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని బండి సంజయ్ తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

 

[ Bandi Sanjay inaugurates new BSF buildings in Chennai, BSF Sector Headquarters, PM MODI, Union Home Minister Amit Shah, Chennai,  Telugu One, Telugu News ] 

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.