Chennai: దేశ రక్షణలో బీఎస్ఎఫ్ కీలక పాత్ర: బండి సంజయ్

Publish Date:Sep 25, 2026

Advertisement

చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.! 

 దేశ రక్షణలో బీఎస్ఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలైట్లు, దేశ వ్యతిరేక శక్తులపై పోరాటంలో బీఎస్ఎఫ్ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. చెన్నైలోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్తగా నిర్మించిన పలు భవనాలను బండి సంజయ్ ప్రారంభించారు. రూ.11.07 కోట్లతో నిర్మించిన పరిపాలనా భవనం, రూ.4.74 కోట్లతో నిర్మించిన గెజిటెడ్ అధికారుల భవనం, రూ.9.86 కోట్లతో నిర్మించిన సిబ్బంది బ్యారక్, రూ.5.30 కోట్లతో నిర్మించిన సబార్డినేట్ అధికారుల భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బీఎస్ఎఫ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 2014లో చెన్నై–మల్కాన్‌గిరి సెక్టర్ ఏర్పడినప్పటి నుంచి బీఎస్ఎఫ్ సిబ్బంది నక్సలైట్లు, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జవాన్లు చూపిస్తున్న ధైర్యం, అప్రమత్తత, అంకితభావం అభినందనీయమన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు రక్షణ గోడలా నిలిచి దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు. వారి సేవల వల్ల మల్కాన్‌గిరి ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి పరిస్థితులు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు.దేశ సరిహద్దులను కాపాడే జవాన్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని బండి సంజయ్ తెలిపారు. జవాన్లు ఎలాంటి వాతావరణంలోనైనా విధులు నిర్వహి స్తున్నారని, వారికి మెరుగైన వసతి, విశ్రాంతి, పరిశుభ్రత, ఇతర మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

చెన్నైలో ప్రారంభించిన కొత్త భవనాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని, దేశం కోసం పనిచేస్తున్న జవాన్ల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇవి నిదర్శనమని అన్నారు. విధులు ముగించుకున్న తర్వాత జవాన్లు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని, మరింత ఉత్సాహంతో విధుల్లో పాల్గొనేలా మంచి వాతావరణం కల్పించడమే లక్ష్యమని వివరించారు. దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది, వారి కుటుంబాలకు చెన్నై సెక్టర్ ద్వారా వైద్య, విద్య, సంక్షేమ, పరిపాలనా సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని బండి సంజయ్ తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

 

[ Bandi Sanjay inaugurates new BSF buildings in Chennai, BSF Sector Headquarters, PM MODI, Union Home Minister Amit Shah, Chennai,  Telugu One, Telugu News ] 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.