బీహారు ఓటరుపై...ఓటు చోర్ యాత్ర ప్రభావం?

Publish Date:Aug 26, 2025

Advertisement

 

త్వరలో జరగానున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర’ చివరాఖరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17 న ససారలో ప్రారంభమైన రాహుల్ యాత్ర, సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది. అయితే, రాహుల్ గాంధీ సాగిస్తున్న ఈ యాత్ర రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా ? అంటే, రాజకీయ విశ్లేషకుల నుంఛి అవుననే సమాధానమే వస్తోంది. 

అయితే, రాహుల్ యాత్ర ప్రభావం, ఆయన ఆశించిన స్థాయిలో, ఆశించిన విధంగా అయితే, ఉండకపోవచ్చని, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కావల్సినంత వ్యతిరేకత వుంది. ముఖ్యంగా అటునుంచి ఇటు ఇటునుంచి అటూ గోడలు దూకుతూ,14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకుని కూర్చున్న నితీష్ కుమార్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మాత్రమే కాదు, ఒక విధమైన ఏహ్య భావం కూడా ఏర్పడిందని, అంటున్నారు.  

దానికి తోడు, నిరుద్యోగం,క్షీణిస్తున్న శాంతి భద్రతల సమస్యలు తదితర సమస్యల కారణంగా, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. అవును   ఇటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల, అటు, ఎన్డీఎ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, ఇటీవల వివిధ సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలను గమనిస్తే రాష్ట్రంలో, కేవలం 18 శాతం మంది ఓటర్లు మాత్రమే, ఎన్డీఎ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో 48 మంది ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 

అన్నిటికీ మించి, ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు, 25 శాతం మంది నితీష్ కుమార్’ కు జై కొడితే, 32 శాతం మంది ఆర్జేడీ, నాయకుడు,మహా ఘటబంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ యాదవ్’కు జై కొట్టారు. ముఖ్యంగా యువత తేజస్వీ యాదవ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. నితీష్ కుమార్’కు తేజస్వీ యాదవ్’  బలమైన ప్రత్యర్ధిగా ఓటర్లు గుర్తిచినట్లు సర్వేలు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్టోబర్, నవంబర్ నెలలో జరగనున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, ఎగసి పడుతున్న నితీష్ ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్రంలో వీస్తున్న తేజస్వీ అనుకూల పవనాలను ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రాలుగా చేసుకుంటే, మహా ఘట బంధన్’ విజయావకాశాలు’ మరింత మెరుగ్గా ఉండచ్చని పరిశీలకులు అంటున్నారు. 

అలాగే, రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర’ వలన కూడా మహా ఘటబంధన్’ కు కొంత ప్రయోజనం జరగవచ్చు కానీ, ఎన్నికల కథా కథనం స్థానిక సమస్యల నుంచి పక్కకు వెళ్ళే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర’కు ఆశించిన స్థాయిలో స్పందన రాక పోగా, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదనే విషయం తేట తెల్లం కావడంతో, ఒక ప్రత్యేక వర్గానికి చెందిన ప్రజలు మినహా ఇతర వర్గాల ప్రజలు రాహుల్ యాత్రను అసలు పట్టిచుకోవడం లేదని అంటున్నారు. 

అలాగే,అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సహజంగా స్థానిక సమస్యలు,స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ, జాతీయ అంశాలకు మరీ ముఖ్యంగా, ఎన్నికల అక్రమాలకు సంబదించిన అంశాలకు ఓటర్లు అంతగా ప్రాధాన్యత ఇవ్వరని పరిశీలకులు బావిస్తునారు. నిజానికి,  నితీష్ వర్సెస్ తేజస్వీగా సాగ వలసిన ఎన్నికల  ప్రచారం, రాహుల్ ఎంట్రీతో మోదీ వర్సెస్ రాహుల్. పోల్ బ్యాటిల్’ గా మారుతోందని, ఇది మహా ఘట బంధన్’ కు అంతగా మంచిది కాదని అంటున్నారు.అంతే కాకుండా మహా ఘట బంధన్’ కు అనుకూలంగా ఉన్న వాతావరణం తిరగబడే ప్రమాదం లేక పోలేదని విశ్లేషకులు అంటున్నారు.


 

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.