Publish Date:Jun 26, 2026
పోక్సో కేసులో అరెస్టై చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న బండి సాయి భగీ రథ్‌కు పరీక్షలు రాసేందుకు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయనను శుక్రవారం (జూన్ 24) తిరిగి జైలుకు తరలించారు. మహీంద్రా యూనివర్సిటీలో బీబీఏ కోర్సు చదివిన భగీరథ్ నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో.. వాటికి సంబంధించిన స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలను యూనివర్సిటీ ఇటీవల నిర్వహించింది. గత మే నెలలో జరిగిన సాధారణ సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ఆయన పోక్సో కేసులో జైలులో ఉండటం తో పరీక్షలు రాయలేకపో యాడు. దీంతో విద్యా సంవ త్సరం నష్టపోకుండా ఉండేం దుకు యూనివర్సిటీ ప్రత్యే కంగా మరోసారి స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలను ఏర్పాటు చేసింది.
ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు భగీరథ్ ఈ నెల 19న కోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందారు. దీంతో ఈ నెల 20న చర్లపల్లి జైలు నుంచి తాత్కాలికంగా విడుదలైన ఆయన, యూనివర్సిటీ నిర్వహించిన స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో కోర్టు విధించిన మధ్యంతర బెయిల్ గడువు కూడా ముగిసింది. దీంతో భగీరథ్‌ను పోలీసులు మేడ్చల్, మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను తిరిగి చర్లపల్లి కేంద్ర కారా గారానికి తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandi-sai-bhagirath-back-to-cherlapally-jail-36-224229.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.