బండి వారి స్వామి భక్తి!

Publish Date:Jun 8, 2022

Advertisement

తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎలాగయినా కూలదోసేయాలన్న కంకణం కట్టుకున్నారు యావత్‌ బిజెపీ నాయకులూ. రాష్ట్రానికి ఢిల్లీ నాయకులు రావడం ఇక్కడ హితోపదేశం చేయడం వెళ్లడం మామూలయి పోయింది. అటు నుంచి ఇటు ఏ కాషాయ వస్త్రధారులు వచ్చినా రాజకీయమే మాట్లాడుతున్నారు. ఇక్కడ బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసి తమ సత్తా ఏమిటన్నది చాటడంలో తల మునకలయ్యారు తెలంగాణా బిజెపీ నాయకులు, కార్యకర్తలు.
ప్రధాని వెూడీ సైతం తెలంగాణాలో పార్టీ అధికారంలోకి రావాలనే గట్టిగా అనుకుంటున్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ కుటుంబ పాలనలాగానే తెలంగాణాలో కేసిఆర్‌ కుటుంబ పాలన వుందని దీన్ని సాగనీయరాదని పట్టుదలతో వున్నారు యావత్‌ బిజెపీ వర్గీయులు. ఇందుకోసం అనేక మార్గాలు అవలంబిస్తున్నారు. పోతే, నాయకులు ఢిల్లీ వెళ్లి చర్చించడం, వ్యూహ రచనలకు బలం చేకూర్చుకోడం మామూలే. కానీ బండి సంజయ్ ఇక్కడి నుంచి ఏకంగా కొందరు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లను కూడా తీసికెళ్లేరు. వారితో ప్రధాని మాట్లాడటం చాలా చిత్రంగా వుంది.ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పాయింట్ మెంట్ ఇచ్చి కేటాయించే సమయం కంటే ఎక్కువ సమయం కార్పొరేటర్లకు మోడీ కేటాయించి మాట్లాడటం వారి యోగ క్షేమాలు, కుటుంబ సభ్యుల వివరాలు సైతం తెలుసుకుని ఆత్మీయంగా మెలగడం ఏ విధంగా చూసినా ఆశ్చర్యం కలిగించక మానదు. అయితే
కార్పోరేటర్లకు ఢిల్లీ నగర సందర్శన చేయించడం, కేంద్రంలో తన పరిచయాలను వారికి తెలిసేట్టు చేసి తన గౌరవాన్ని పెంచుకోవాలన్న తాపత్రయం బండి బాగానే ప్రదర్శించేరు. రైల్లోనో, విమానంలోనో ఢిల్లీ తీసికెళ్లి అక్కడి వాతావరణం పరిచయం చేసి మనం కూడా ఇలా వుండాలని, ప్రధాని చెప్పే సూక్తిముక్తావళిని ఆకళింపు చేసుకుని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తేనే మనకు మనుగడ అన్న సూత్రాన్ని కార్పొరేటర్లకు తెలియజేసి వుంటారు. వారు తమ నాయకుడు ఏకంగా ప్రధానిని కలిసే అదృష్టం కల్పించేరన్న ఆనందం బాగానే వుంటుంది. జీవితాంతం బండి పేరు చెప్పుకుంటారు. ఎందుకంటే వేరే పార్టీలో ఇలాంటి అవకాశం వారికి కలిగే అవకాశం వుండేది కాదేవెూ!
కార్పొరేటర్ల సమావేశంలో వారు సమాజసేవతో పాటు అట్టడుగు వర్గాలకు చేయవలసిన సహాయసహకారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని వెూదీ బోధ చేసేరు. అంతే కాదు కేవలం కార్పొరేటర్ల గానే మిగిలిపోకుండా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని గెలవాలని లేనిపోని వూహలు రేకెత్తించారు. అసలే బండి సంజయ్ తో వెళ్లినవారు, పైగా బీజేపీ కార్పొరేటర్లు తప్పకుండా వెూదీ జపం చేసేవారే అయి వుంటారు. మరి ఏకంగా ప్రధానే తమకు గొప్ప మార్గాన్ని సూచించేరు గనుక రేపటి నుంచే కాబోయే ఎమ్మెల్యేలం అనుకుంటే హైదరాబాద్‌ పరిస్థితి ఏం గావాలి అసలే జీహెచ్‌ఎంసీ పనుల పట్ల ప్రజలు విసిగెత్తుతుంటారు.
ఇప్పుడు ఎమ్మెల్యేలని కలలుగంటూ ఆ ధ్యాసలోనే వుంటే కార్పొరేటర్లుగా వారు వెలగబెట్టేది శూన్యమే! కార్పొరేటర్లను ఢిల్లీ తీసికెళ్లడం బండి సంజయ్ కి రాజకీయంగా ఎంతో వుపయోగపడుతుందేవెూగాని హైదరాబాద్‌కి కాదు. అందుకే టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కి కోపం వచ్చింది. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక ఎన్జీఓ నా అంటూ గట్టిగానే ప్రశ్నించేరు. రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు, చేయవలసిన సాయం గురించి ఆలోచించి తగిన విధంగా స్పందించాల్సిందిబోయి కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు కావడం లక్ష్యంగా పెట్టుకోమని గొప్ప సూచన చేయడం ప్రధాని స్థాయికి తగదేవెూనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమయినప్పటికీ, ఈ విధంగా నగర  కార్పొరేటర్లను ప్రత్యేకంగా కలిసి వారితో మాట్లాడటం, వారికి సమాజసేవ గురించి చెప్పడం ప్రధాని వెూదీ వల్లనే అయింది. బండి   అడుగడుగునా భజంత్రీలతో సిద్ధపడి, తన స్వామి భక్తిని బాగా చాటుకుంటూ చిర్నవ్వుతో తనకు కేంద్రంలో వున్నవారికీ మధ్య సత్సంబంధాలను లోకల్‌ టాలెంట్‌కి బాగానే ప్రదర్శించేరు.  

By
en-us Political News

  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.