Publish Date:Jul 14, 2025
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Publish Date:Jul 14, 2025
ఇండియా, ఇంగ్లాండ్ మూడో టెస్టు రసవత్తరంగా మారింది. ఇండియా విజయం సాధించాలంటే చివరి రోజు ఆటలో 135 పరుగులు చేస్తు చాలు. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. అద్భుత ఫామ్ లో ఉన్న రాహుల్ క్రీజ్ లో ఉన్నాడు.
Publish Date:Jul 14, 2025
రప్పా.. రప్పా.. డైలాగ్‌పై పేటెంట్ తీసుకున్నట్లు దాన్నే స్లోగన్‌గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు ... జగన్ సైతం ఆ డైలాగ్ వాడకాన్ని సమర్ధించడంతో ఆయనతో వీరతాళ్లు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ఫ డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చ గొడుతూ.. పోలీసులకు వార్నింగులిస్తున్నారు.
Publish Date:Jul 14, 2025
గోవా గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
Publish Date:Jul 14, 2025
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఇటీవల అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రశన్నకుమార్ రెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఈ విషయంలో కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. అయితే.. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్వత్రా నల్లపరెడ్డి ప్రసన్నకుమారరెడ్డి వ్యాఖ్యలపై ఖండనలు వెల్లువెత్తాయి.
Publish Date:Jul 14, 2025
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి కొత్త అంతరిక్ష విధానాన్ని ప్రకటించిన చంద్రబాబు సర్కార్.. ఈ విధానం అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.
Publish Date:Jul 14, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబునాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు.
Publish Date:Jul 13, 2025
బ్యాడ్మింట్ స్టార్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధం నుంచి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. తాము విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సైనా నెహ్వాల్ సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు.
Publish Date:Jul 13, 2025
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డి పల్లె కట్టపస మామిడికాయల లోడ్ తో వెడుతున్న లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
Publish Date:Jul 13, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 14) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
Publish Date:Jul 13, 2025
సెప్టెంబర్ 17.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు. దేశ విదేశీ ప్రముఖులు, అయన తమ కుటుంబంగా భావించే 140 కోట్ల మంది భారతీయులు శుభాకాంక్షలు చెపుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వహించవచ్చు. ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు.
Publish Date:Jul 13, 2025
స్టార్ హోటల్ కిచెన్ తరహాలో
ఏర్పాటైన ఈ స్మార్ట్ కిచెన్ లో పని చేస్తున్న వంట కార్మికులు, డ్రెస్ కోడ్ తో పాటు వంట వార్పులలో పరిశుభ్రతా చర్యలు పాటిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా ఆధునిక పద్ధతిలో వంటకాల తయారీ చేపడుతున్నారు. ఆహార రవాణా వాహన ట్రాకింగ్ లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు.
Publish Date:Jul 13, 2025
కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.