రాజుకుంటున్న బనకచర్ల.. రేవంత్ వర్సెస్ సీఎం.. - కేంద్రం మౌనం

Publish Date:Aug 16, 2025

Advertisement

ఏపీ ప్రభుత్వం నిర్మించ సంకల్పించిన  బనకచర్ల ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం..  వృథాగా పోయే గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆ జలాలను  మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే దిగువ రాష్ట్రమైన ఏపీ నిర్మిస్తామంటున్న ప్రాజెక్టుపై ఎగువ రాష్ట్రం తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్లతో ఎగువ రాష్ట్రాలకు నష్టమేంటని నిలదీశారు. అలాగే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో బనకచర్ల అంశం ఇప్పుడు మరోసారి హీటెక్కి హాట్ టాపిక్ గా మారింది. 

గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేవలం వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలించనుండటంతో గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని భావిస్తోంది.

రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దానికి నిధుల కోసం  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో  సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే చర్చించారు. బనకచర్ల ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసింది. అయితే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. బనకచర్ల  ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పు పడుతోంది.

బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పంద్రాగస్టు వేడుకల్లో కౌంటర్ ఇచ్చారు. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా దక్కించుకుంటామని నిక్కచ్చిగా చెప్పారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామన్నారు.

అయితే సీఎం చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదనీ,  సముద్రంలోకి వృథాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామనీ, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటి? అని పరోక్షంగా తెలంగాణ సర్కార్‌కు ప్రశ్నలు సంధించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? అని నిలదీశారు. కాగా రాయలసీమను నీటితో సశ్యశామలంగా చేసేందుకు బనకచర్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే . అయితే దీనికి తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో వివాదం రాజుకుంది. చంద్రబాబు మాత్రం రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం నుంచి బనకచర్లకు నీరు అందిస్తామని స్పష్టం చేస్తున్నారు.  మరి చూడాలి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుందో?

By
en-us Political News

  
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.